ప్రయాణానికి ఉత్తమ సమయం : వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉన్న సమయం పుష్కర్ సందర్శనకు ఉత్తమ మైనది. నవంబర్ నెలలో పుష్కర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఒంటెల సంత, పుష్కర్ సంత జరుగుతుంది.
వాతావరణం పుష్కర్ లో ప్రధానంగా తేమతో కూడిన వేడి వాతావరణం ఉన్నప్పటికీ, శీతాకాలాలు, వర్షాకాలం కూడా ఉంటాయి. వేసవి కాలం (మార్చ్ నుండి జూన్) : వేసవి కాలం మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, 25 డిగ్రీలు గా ఉంటాయి.
వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ ) : వర్షాకాల౦ లో పుష్కర్ లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి, వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. రాజస్తాన్ లోని ఈ ప్రాంతం లో వర్షాలు సెప్టెంబర్ వరకు ఉంటాయి.
శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు) : ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉండే శీతాకాలం నవంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉంటాయి.