విమాన మార్గం నగర శివార్లలో ఉన్న మధురపూడిలో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉన్నది. ఇది రాజమండ్రి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ మద్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు భవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా చేసింది. ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్ మరియు స్పైస్ జెట్ వారు హైదరాబాదు,చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలను నడుపుతున్నారు.