Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజౌరి » వాతావరణం

రాజౌరి వాతావరణం

ప్రయాణం కు ఉత్తమ సీజన్: రాజౌరి జిల్లా అన్వేషించడం ఆసక్తి గల పర్యాటకులకు ఏప్రిల్ నుండి జూన్ వరకు అంటే వేసవి కాలం సందర్శించడానికి మంచి సమయము. వాతావరణ పరిస్థితులు అనుకూలం గా ఉంటె పర్యాటకులు శీతాకాలంలో కూడా రాజౌరి జిల్లాకు వారి యాత్ర ను ప్లాన్ చేసుకోవచ్చు.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్):వేసవి ఏప్రిల్ నుండి మొదలై జూన్ నెల వరకు ఉంటుంది. వేసవిలో రాజౌరి జిల్లా యొక్క గరిష్ట ఉష్ణోగ్రత 37°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 20°C వద్ద నమోదు అవుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): వర్షాకాలం జూలై నుండి మొదలై సెప్టెంబర్ నెలలో ముగుస్తుంది. రాజౌరి జిల్లా లో ఆగష్టు నెలలో గరిష్ట వర్షపాతం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ అవపాతం ఉన్న సమయంలో కూడా ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ వర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. జమ్మూ & కాశ్మీర్ ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇక్కడ శీతాకాలాలు చాలా కఠినమైనవి కాదు. రాజౌరి జిల్లాలో శీతాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 15°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 7°C గా నమోదు అవుతాయి. సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా మరింత పడి పోతాయి.