ఇక్కడకు వచ్చే టూరిస్టుల కు కామ్పింగ్ చేయటం లో ఆసక్తి అధికంగా వుంటుంది. ప్రత్యేకించి కోసి నది ఒడ్డున క్యాంపు చేయటం ఒక మరువలేని అనుభూతి. పచ్చని ప్రదేశాలతో, సుందర దృశ్యాలతో ఈ ప్రదేశం టూరిస్టులకు మరువలేని మధురానుభూతులు కలిగిస్తుంది.
రాం గర్ పర్వత ప్రాంతంలో పర్వతా రోహణ ఆనందించవచ్చు. కొత్తగా పర్వతారోహణ చేసేవారికి లేదా అనుభవం కల పర్వతారోహలకు కూడా ఆనందంగానే వుంటుంది.
రాం ఘర్ లో మౌంటెన్ బైకింగ్ క్రీడ ఆచరించటం ఒక సవాలుగా వుంటుంది. బైకింగ్ లో ఈ అడవి ప్రదేశ అందాలను శోధించవచ్చు.
రాం ఘర్ లో ఫిషింగ్ క్రీడ, కోసి రివర్ ఒడ్డున చేస్తారు. ఈ క్రీడా ఇక్కడ ఎంతో ఆనందంగా వుంటుంది. ఈ నదిలో మహాసీర్ చేపల సంతాన ఉత్పత్తి జరుగుతుంది. కోసి రివర్ లో ఫిషింగ్ ఏర్పాట్లకు ఇక్కడ అనేక రిసార్ట్ లు కూడా కలవు.