ఆనందపూర్ సాహిబ్ హిమాలయా శ్రేణుల దిగువ భాగంలో కలదు. దీనిని ‘హోలీ సిటీ అఫ్ బ్లిస్స్’ అంటారు. ఈ సిటీని తొమ్మిదవ సిక్కు గురు తెఘ్ బహదూర్ కనుగొన్నారు. బిలాస్ పూర్ కు చెందిన రాణి చంప తన భర్త అంత్య క్రియలకు హాజరైన గురుకు చిన్న పాటి భూమి కానుకగా ఇచ్చిందని చెపుతారు. అక్కడ గురు తెఘ్ బహదూర్ చక్కి నానాకి అనే వూరు స్థాపించగా తర్వాతి కాలంలో అది ఆనందపూర్ సాహిబ్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. వార్షిక పండుగ హోల్లమోహల్ల ఇక్కడ కూడా జరుపుతారు. ఈ ప్రదేశం రూప నగర్ కు 41 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇక్కడ సిక్కులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ గురుద్వారాలు కూడా కలవు.



Click it and Unblock the Notifications