Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శబరిమల » వాతావరణం

శబరిమల వాతావరణం

సందర్శించేందుకు అనువైన సమయం ఇక్కడి వాతావరణం అన్ని సిజన్లలో శబరిమల ను సందర్శించేందుకు అనువుగా ఉంటుంది. అయినా సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. వర్షాకాల ప్రభావం, ఎండాకాలం మొదలవ్వక ముందు ఉండే పచ్చదనం వల్ల ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్ 15 వ తేది నుండి డిసంబర్ 26 వ తేదీ వరకు రోజు మొత్తం ఈ గుడి తెరిచే ఉంటుంది.  

వేసవి

ఎండాకాలం శబరిమల లో ఎండాకాలం మార్చ్ నెలలో ప్రారంభమై మే నెల చివరి వరకు ఉంటుంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడ నమోదవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండాకాలం లో వేడిగా ఉన్నప్పటికీ, ఇబ్బందిపెట్టేరకంగా ఇక్కడ వాతావరణం ఉండదు.  

వర్షాకాలం

చలికాలం

వర్షాకాలం శబరిమలలో జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ సమయంలో శబరిమల సందర్శనం ఏంతో ఆహ్లాదకరం. ఆకుపచ్చని తివాచీ పరిచినట్టుగా ఉండే పచ్చటి చెట్లు, కొండలని తాకిన వర్షపు జల్లులు సందర్శకులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. భారి వర్షపు జల్లులతో బహుకరించబడిన శబరిమల లో వాతావరణం దివ్యంగా, మనోహరంగా మరియు అధ్బుతంగా కనువిందు కలిగిస్తుంది. శీతాకాలం చలికాలం ఇక్కడ నవంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. శబరిమలను సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయంలోనే ప్రధాన పండుగలు చోటు చేసుకుంటాయి. చలికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల కి చేరుతుంది. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది.