ప్రయాణానికి ఉత్తమ కాలం: సలోగ్ర చూడటానికి ఆసక్తిగల పర్యాటకులు ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో రావలసిందిగా సూచిస్తారు. అయితే, వాతావరణ పరిస్థితులు ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉండే శీతాకాలంలో కూడా సలోగ్రకు పర్యాటకులు విహారయాత్ర కోసం రావచ్చు.
సలోగ్ర ఉప సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది, ఫలితంగా, ఈ ప్రాంతంలో సంవత్సరంలో చాలా భాగం వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి.వేసవి (మార్చి నుండి మే): ఇక్కడ వేసవి ఏప్రిల్ నుండి మొదలై జూన్ నెల వరకు ఉంటుంది. వేసవిలో సలోగ్ర గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35° సెం. మరియు 15 ° సెం. వద్ద నమోదు అవుతాయి. మే నెల ఇక్కడ సంవత్సరం మొత్తంలో అత్యంత వేడిగా ఉండే కాలంగా భావించబడుతుంది. సూర్యాస్తమయం తరువాత, ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల, రాత్రులు, తులనాత్మకంగా, చల్లగా ఉంటాయి.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబరు): వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ నెలలో ముగుస్తుంది. సలోగ్ర నైరుతి రుతుపవనాలు కారణంగా గరిష్ట వర్షపాతం అనుభవిస్తుంది. యాత్రికులు ఈ ప్రాంతపు అత్యద్భుత హరిత అందాలని ఆస్వాదించడానికి ఈ కాలంలో ఇక్కడ పర్యటించవచ్చు.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): డిసెంబర్ లో ప్రారంభం అయ్యే శీతాకాలం, ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. శీతాకాలంలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 15° సెం. మరియు -2° సెం. వద్ద నమోదు అవుతాయి. సలోగ్ర శీతాకాలంలో భారీ హిమపాతం అనుభవిస్తుంది, అయితే, వాతావరణ పరిస్థితులు ట్రెక్కింగ్ కు అనుకూలంగానే ఉంటాయి.