Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సానాసార్ » వాతావరణం

సానాసార్ వాతావరణం

సందర్శించడానికి ఉత్తమ కాలం: సానాసార్ ప్రయాణానికి ఉత్తమ సమయం మార్చి నుండి మే వరకు (వేసవి). సంవత్సరం లోని ఈ సమయంలో, పారాగ్లైడింగ్, పర్వతారోహణ, రాతి అధిరోహణ వంటి అన్ని సాహసోపేత చర్యలు చేపట్టవచ్చు.

వేసవి

సానాసార్ ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణం అనుభవిస్తుంది. వేసవికాలాలు మధ్యస్థంగా ఉండి, శీతాకాలాలు కఠినమైన వాతావరణ పరిస్థితులతో నివాసయోగ్యం కాకుండా ఉంటాయి. వేసవి కాలం (మార్చి నుండి మే): వేసవి కాలం మార్చి నుండి మొదలై మే నెల వరకు ఉంటుంది. సానాసార్ వేసవిలో మధ్యస్థ వాతావరణ పరిస్థితులు కలిగి వుంటుంది. వేసవిలో సానాసార్ గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మరియు 5 డిగ్రీలుగా నమోదు అవుతుంది. ఈ కాలంలో వచ్చే యాత్రికులు తేలికపాటి ఉన్ని దుస్తులు తీసుకుని రావటం మంచిది.

వర్షాకాలం

వర్షా కాలం (జూలై నుండి సెప్టెంబర్): జూలై నెలలో మొదలయ్యే రుతుపవన కాలం సెప్టెంబర్ నెల వరకు కొనసాగుతుంది. సానాసార్, ఈ సమయంలో మధ్యస్థ వర్షపాతం అందుకుంటుంది. వర్షాకాలాలలో సానాసార్ సందర్శించడానికి వెళ్ళే పర్యాటకులు ఇతర వస్తువులతో పాటు వర్షపు దుస్తులు తీసుకు వెళ్లాలని సూచిస్తారు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి): శీతాకాలం సాధారణంగా సానాసార్ లో ఎక్కువ సమయం ఉంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి నెలలో ముగుస్తుంది. శీతాకాలంలో సానాసార్ లో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 24 డిగ్రీలు మరియు -14 డిగ్రీలు గా నమోదు అవుతాయి. గడ్డ కట్టే ఉష్ణోగ్రత నివారించడానికి, ప్రయాణికులు శీతాకాలంలో సానాసార్ సందర్శించ వద్దని సిఫార్సు చేస్తారు.