Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేవాగ్రాం » వాతావరణం

సేవాగ్రాం వాతావరణం

పర్యటనకు అత్త్యుత్తమ సమయం :ఏడాదిలో చాల భాగం ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా వుంటుంది. కాబట్టి శీతాకాలంలో సేవాగ్రాం పర్యటనకు ఉత్తమమైన సమయం. వర్షాకాలం తర్వాత అక్టోబర్, నవంబర్ లలో కూడా సేవాగ్రాం పర్యటన బాగుంటుంది.

వేసవి

వేసవి:సేవాగ్రాం లో వేసవి చాల వేడిగా వుంటుంది. మార్చ్ నెల నుంచి జూన్ ప్రారంభం దాకా, ఇక్కడ పగటి పూట గరిష్టంగా ౪౨ డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి వేళల్లో ౨౮ డిగ్రీలు వుంటుంది. పర్యాటకులకు ఈ కాలం చాల అసౌకర్యంగా వుంటుంది కాబట్టి ఈ కాలంలో రాకపోవడం ఉత్తమం.

వర్షాకాలం

వర్షాకాలం :సేవాగ్రాం అందం చూడాలంటే వర్షాకాలంలోనే రావాలి. వర్షాకాలం ఇక్కడ జూన్ మొదట్లో ప్రారంభమై సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈ ప్రదేశంలో వర్షపాతం తక్కువే, నిజానికి సరిపోయేంత వానలు పడవు. ఐతే, మండు వేసవి తర్వాత ఉష్ణోగ్రతలు భరించగలిగే స్థాయికి దిగిపోతాయి.

చలికాలం

శీతాకాలం :ఇక్కడి శీతాకాలం లో వాతావరణం అతి చల్లగా వుంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మొదటి వారం దాక, ఉష్ణోగ్రతలు గరిష్టంగా ౨౮ డిగ్రీలు, కనిష్టంగా ౧౫ డిగ్రీలు ఉంటాయి. ఈ కాలంలో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా వుండటంతో ఇక్కడ విడిది కూడా హాయిగా వుంటుంది.