Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సింహాచలం

సింహాచలం - ది ల్యాండ్ అఫ్ నరసింహ

10

సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకు చాలా ప్రసిద్ది చెందింది. సింహాచలం లో నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ నరసింహ స్వామి విష్ణువు యొక్క సగం మనిషి, సగం సింహం అవతారం ఉన్న పద్దెనిమిది ఆలయాలలో ఒకటి. ఆలయంలో అర్చకులు స్వామిలోని వేడిని చల్లార్చడానికి విగ్రహానికి గంధం పేస్ట్ తో పూత పూస్తుంటారు.ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో)సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

ఒక శాసనం ప్రకారం 1098 AD, చోళ రాజు కులోత్తుంగ కాలం నాటిది అని,మరొక శాసనం ప్రకారం 1137 మరియు 1156 AD మధ్య నివసించిన కళింగ రాణిని సూచిస్తుంది.ఈ శాసనాలనుబట్టి ఆలయ వయసును అంచనా వేయవచ్చు. నిజానికి, ఆలయ గోడలపై చాలా ఎక్కువగా 252 శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు మాత్రమే ఆలయ పురాతనత్వం సూచించడానికి మరియు పురాతత్వ శాస్త్రజ్ఞులకు ప్రధాన చారిత్రక ఘటనలు తెలియ జేసాయి. ఆలయ గోడలపై శాసనాలు తెలుగు మరియు ఒరియా బాష లలో ఉన్నాయి, మరియు ఆలయ నిర్మాణం కూడా రెండు ప్రాంతాల యొక్క నిర్మాణ శైలి గుర్తుచేస్తుంది. గంగాధర, పవిత్ర స్నానం ట్యాంక్ కూడా కొండ మీద కనిపిస్తాయి.

దేవుని చుట్టుపక్కల ఆసక్తికరమైన పురాణం

గ్రామానికి ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. దాని ప్రకారం ముస్లిం మత ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో దాడి మరియు దోపిడి చేసినప్పుడు కుర్మంత అనే కవి రక్షణ కోసం నరసింహ స్వామి ని తీవ్రంగా ప్రార్ధించాడు. ఆ గ్రామం వారిని నరసింహస్వామి ఆక్రమణదారుల సైన్యం దాడి నుండి రక్షించుటకు రాగి కందురీగల సమూహమును పంపించి రక్షించెను. ఆ విదంగా నరసింహ స్వామి ప్రజలను రక్షించటం జరిగింది. ఈ ప్రదేశం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

వాతావరణం, ప్రయాణమార్గాలు, ఉత్తమ సమయం

వేసవి కాలంలో వేడి ఎక్కువ ఉంటుంది. శీతాకాలం లో వాతావరణం ఆహ్లాదకరముగా ఉండి పర్యాటకులు సందర్శించటానికి మంచి సమయం. ప్రధాన పట్టణాలు మరియు దక్షిణ భారతదేశం యొక్క అన్ని నగరాల నుంచి రోడ్లు ద్వారా సులభంగా సింహాచలంను చేరవచ్చు.

 

సింహాచలం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సింహాచలం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సింహాచలం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? సింహాచలం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం రాష్ట్ర బస్సు సర్వీసు రాష్ట్రంలో అనేక నగరాలు మరియు పట్టణాలు నుండి సింహాచలం వెళ్ళటానికి అన్ని వేళల్లోను బస్సులు నడుపుతుంది. నిజానికి, తమిళనాడు, కర్ణాటక పొరుగు రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ మరియు వైజాగ్ వరకు బస్సు సేవలు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం సింహాచలం లో రైల్వే స్టేషన్ లేదు.దానికి సమీప రైల్వే స్టేషన్ వైజాగ్ లేదా విశాఖపట్నంలో ఉంది.వైజాగ్ లో రైల్వే స్టేషన్ నుండి దేశంలోని అనేక నగరాలు మరియు పట్టణాలకు రైళ్లు వెళ్ళతాయి .మంచి నెట్వర్క్ ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడింది.రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం వెళ్ళటానికి బస్సు లేదా టాక్సీ లు ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం సింహాచలం సమీపంలోని విమానాశ్రయం వైజాగ్ లేదా విశాఖపట్నం లో ఉంది.ఈ విమానాశ్రయంకి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలో, మరియు చెన్నై సహా దేశంలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాల నుండి విమాన సౌకర్యం ఉంది.ఈ విమానాశ్రయం సింహాచలంనకు16 కిమీ దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి సింహాచలం టాక్సీ లో వెళ్ళటానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jan,Tue
Return On
01 Feb,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
31 Jan,Tue
Check Out
01 Feb,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
31 Jan,Tue
Return On
01 Feb,Wed

Near by City