Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోలన్ » వాతావరణం

సోలన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: ఈ ప్రదేశం సంవత్సరం మొత్తం ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగి ఉండటం వల్ల, పర్యాటకులు సంవత్సరంలో ఏ సమయంలోనైనా సోలన్ ని సందర్శించవచ్చు.

వేసవి

సోలన్ ప్రాంతం ఏడాది పొడవునా ఉప సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉన్న కారణంగా, చాలా వరకు ఆహ్లాదంగా మరియు చల్లగా ఉంటుంది. వేసవికాలంలో వేడిగా, శీతాకాలాలు హిమపాతం తో కూడి ఉంటాయి. ఈ ప్రదేశం, రుతుపవన కాలంలో గణనీయమైన వర్షపాతం కలిగి ఉంటుంది. వేసవి (మార్చి నుండి మే): ఈ ప్రాంతంలో వేసవి, మార్చి నెల నుండి మొదలయి, మే నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 35 ° సెం. నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 15° సెం. కి సమీపంలో ఉంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంత వాతావరణం వెచ్చగా ఉండి, మే నెల అత్యంత వేడిగా ఉంటుంది. అయితే, ఉష్ణోగ్రత రాత్రులు గణనీయంగా పడిపోతుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబరు):సోలన్ లో రుతుపవన కాలం, జూలై నెల నుండి మొదలయి, వర్షపాతం సెప్టెంబర్ నెల వరకు కొనసాగుతుంది. ఈ స్థలం నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షపాతం పొందుతుంది. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, అక్టోబర్ మరియు నవంబర్ మధ్య నెలలు, ఈ ప్రాంతం సందర్శించడానికి అనువుగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలాలు (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): శీతాకాలాలు, ఇక్కడ డిసెంబర్ నెల నుండి మొదలయి, ఫిబ్రవరి నెల వరకు ఉంటాయి. ఈ ప్రాంత వాతావరణం చాలా చల్లగా తయారయి, ఉష్ణోగ్రతలు -2° సెం. దాకా పడిపోతాయి. ఈ కాలంలో, హిమపాతం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 15 ° సెం. వద్ద ఉంటుంది.