సోండా వాతావరణం సోండా సందర్శించాలంటే, శీతాకాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
వేసవి ( మార్చి నుండి మే) - సోండాలో వేసవి చాలా వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా ఉంటాయి. కనుక పర్యాటకులు ఈ కాలం ఎంపిక చేయరు.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - ఈ ప్రదేశం సముద్రానికి సమీపంలో ఉన్న కారణంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పొందుతుంది. కనుక పర్యటనకు అనుకూలంకాదు.
శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - సోండా వాతావరణం శీతాకాలంలో సౌకర్యంగాను, ఆహ్లాదంగాను ఉంటుంది. ఉష్ణోగ్రతలు సుమారు 20 డిగ్రీలుగా నమోదవుతూ సోండా పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.