సుచింద్రం దర్శించాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ సూర్యరశ్మి ఉంటుంది కాని వేడిగా ఉండదు. ఈ శీతాకాల సమయంలో, సుచింద్రం సందర్శించటం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయినా కూడా, పర్యాటకులు తేలికపాటి జాకెట్స్ మరియు షాల్స్ తెచ్చుకోవటం మంచిది.
వేసవికాలం: సుచింద్రం లో వేసవి మార్చ్ నెలలో మొదలై మరియు మే నేల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉషోగ్రత 30-35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఈ సమయంలో హ్యుమిడిటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్న సమయంలో చాలా వేడిగా ఉంటుంది కాని, ఉదయపు,సాయంకాల సమయాల్లో సముద్రం నుండి చల్లని గాలులు వేస్తూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
వానాకాలం: ఇక్కడ జూన్, జూలై ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో భారీ వర్షపాతం ఉంటుంది. ఈ వానలు మెరుపులతో, ఉరుములతో కూడి ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది కాని, గాలిలో తేమ పెరుగుతుంది. ఈ భారి వర్షాల వలన స్థానిక జీవనానికి ఇబ్బంది కలుగుతుంది మరియు పర్యాటకుల సంఖ్య కూడా ఉండదు.
శీతాకాలం:ఇక్కడ ఉత్తర భారతంలా మంచు కట్టే చలి ఉండదు. డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు శీతాకాలపు నెలలు. ఈ సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ మరియు అత్యధిక ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కు మించదు. ఈ సమయంలో మధ్యాహ్నాలు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కాని సాయంకాలాలు, రాత్రిళ్ళు మాత్రం చలిగా ఉంటుంది. సుచింద్రం దర్శించాలంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.