చత్తీస్ ఘర్ ను రామాయణ మరియు మహాభారతాల్లో దక్షిణ కోషాల్ రాజ్యంగా పేర్కొంటారు. ఈ రాజ్యం అనేక హిందూ పాలకులచే పాలించబడి, అనేక దేవాలయాలు కట్టబడింది. సుర్ గూజా ప్రాంతం లో అనేక టెంపుల్స్ కలవు. సుర్ గూజ లోని దీపద్ది అంబికా పూర్ కు 70 కి. మీ. ల దూరం లో కలదు. ఇది సమరి తాలూకా లో వుంది, కచ్చ రోడ్ తో కలుపబడి వుంది.
ఇక్కడ ఒక శంకర్ టెంపుల్, కలదు. దాని చుట్టుపక్కల నాలుగు ఇతర దేముళ్ళు, అంటే, విష్ణు, కార్తికేయ, గణేశ, దేవత మహా దుర్గ విగ్రహాలు కలవు. పర్యాటకులకు ఇది ఒక గొప్ప ఆకర్షణ. ఇక్కడ ఇంకనూ కొన్ని శిదిలమైన టెంపుల్స్, చెరువులు ఆ కాలం నాటి ద్రావిడ శైలి లో కలవు. ఈ శిదిలాలయాలలో ఒకటి మహిష మర్దిని టెంపుల్. స్థంభాలకు వివిధ దేముళ్ళు, దేవతల చిత్రాలు చెక్కారు. తూర్పు వైపు ఒక అతి పెద్ద నంది విగ్రహం తవ్వకాలలో బయట పడింది. కొన్న్ని భూమ్రా శిల్పాలు కూడా వెల్లడయ్యాయి.



Click it and Unblock the Notifications