Search
 • Follow NativePlanet
Share

కైమూర్ – ఆనందాల నగరం !!  

30

కైమూర్ బీహార్ లోని ఉజ్వలమైన వారసత్వం ఉన్న, ఎంతో శక్తివంతమైన ప్రాంతాలలో ఒకటి. బీహార్ లోని పశ్చిమ భాగంలో ఉన్న కైమూర్ జిల్లా ప్రధాన కార్యాలయం భబువలో ఉంది. మైదానాలు పచ్చని ఒండ్రు నేలలతో కూడి ఉండగా, పీఠభూమి ప్రాంతాలు రాళ్లతో నిండి ఉంటాయి. నగర సరిహద్దులలో కర్మనాశ, దుర్గావతి, కుద్ర నదులు ఉన్నాయి.

కైమూర్ చరిత్ర కైమూర్ క్రీ.పూ. 6 వ శతాబ్దం నుండి క్రీ.శ. 5 వ శతాబ్దం వరకు మౌర్యులకు ముందు గుప్తులకు తర్వాత మగధ సామ్రాజ్యంలో ఒక అంతర్గత భాగమైంది. కైమూర్ భారతీయ స్వతంత్ర పోరాటంలో అపారమైన సహకారాన్ని అందించింది.

కైమూర్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

కైమూర్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం, బైద్యనాథ్, ముండేశ్వరి మాత ఆలయం, చోర్ఘాటియ, కర్మనాశ నది, సిధనాథ ఆలయం, ఇంకా ఎన్నో చూడదగిన స్థలాలు ఉన్నాయి. కైమూర్ తన పర్యాటకులను నిరుత్సాహ పరచ కుండా ప్రతి ప్రాంత రుచిని చూపెడుతుంది. కైమూర్ చుట్టూ ఉన్న ఆలయాలు, కోటలు, కొండలు, అడవి, జలపాతాలు, చూడచక్కని ప్రదేశాలు కైమూర్ పర్యాటక రంగాన్ని ఒక సమగ్ర బహుముఖ గమ్యస్థాన౦గా మార్చాయి. తెల్హార్, కైమూర్ దగ్గరగా బి.టి రోడ్డులో ఉన్న ఒక అందమైన జలపాతం. సహజ పరిసరాలలో ఉన్న ఈ జలపాతం చక్కగా కనువిందు చేస్తుంది.

కైమూర్ వివిధ తీర్థయాత్ర ప్రాంతాలు, ఆలయాలలో పెద్ద సంఖ్యలో జరిగే హిందూ పండగలు, ఉత్సవాలకు ఆతిధ్యమిస్తుంది. పర్యాటకులు, తీర్థయాత్రికులు కూడా గుంపులు గుంపులుగా దాని ప్రశాంతతను దగ్గరి నుండి చూడటానికి కైమూర్ ను సందర్శిస్తారు.

కైమూర్ వాతావరణం

కైమూర్ ప్రాంతం విభిన్న వాతావరణ పరిస్థితులతో కూడిన వివిధ కాలాలను చవిచూస్తుంది. వేసవి కాలం ఎంతో వేడిగా ఉండగా, శీతాకాలం కూడా తీవ్రంగా ఉండి, అక్టోబర్, మార్చి మధ్య సమయాన్ని నగర పర్యటనకు అనుకూలంగా మలుస్తుంది.

కైమూర్ చేరడం ఎలా

కైమూర్ కు అతి దగ్గరగా ఉన్న వారణాసి, గయా, పాట్న లలో విమానాశ్రయాలు ఉండగా చక్కటి రైలు, రోడ్డు మార్గాలు కూడా ఉంది.

కైమూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కైమూర్ వాతావరణం

కైమూర్
33oC / 91oF
 • Haze
 • Wind: N 0 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం కైమూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కైమూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం కైమూర్, పాట్న నుండి 200 కిలోమీటర్ల దూరంలో, వారణాశి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 వ నంబరు జాతీయ రహదారి కైమూర్ ను అర్రా మీదుగా రాజధాని పాట్నాకు కలుపుతుంది. దీనితో బాటుగా, కొన్ని రాష్ట్ర రహదారులు కూడా నగరంలో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం మోహనియా ఈ జిల్లాలోని ఒకే ఒక ప్రధాన రైలు జంక్షన్. సాధారణంగా ఈ స్టేషన్ ను మొఘల్ సరాయి ప్రాంతంలో హౌరా- న్యూ ఢిల్లీ గ్రాండ్ కార్డులో ఉన్న భబువ రోడ్డు అని అంటారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్య నగరాల నుండి ఈ నగరానికి ఎక్కువ సంఖ్యలో రైళ్ళు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం కైమూర్ లో విమానాశ్రయం లేదు. విమానంలో ఈ నగరానికి రాదలచినవారు అతి దగ్గరగా ఉన్న వారణాశి విమానాశ్రయం నుండి రావాలి. కైమూర్ నుండి వారణాశి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Sep,Sun
Return On
21 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Sep,Sun
Check Out
21 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Sep,Sun
Return On
21 Sep,Mon
 • Today
  Kaimur
  33 OC
  91 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Kaimur
  30 OC
  87 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Kaimur
  32 OC
  90 OF
  UV Index: 9
  Sunny