Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బుద్ధగయ

బుద్ధగయ-భక్తిమయ స్థలం!  

34

బీహార్ లో ఉన్న బుద్ధగయను చారిత్రికంగా ఉరువేల, సంబోధి, వజ్రాసన లేదా మహాబోధి అని పిలుస్తారు. బుద్ధగయ పర్యాటకం ఆహూతులకు ఆధ్యాత్మిక, అద్భుత నిర్మాణాల విస్తృత అనుభవాలను అందిస్తుంది. బీహార్లో ఈ ఆరామాలను గణనీయమైన సంఖ్యలో గుర్తించినప్పటి నుండి, ఈ ఆరామలకు “విహార” అనే అర్ధం నుండి పేరు ఉద్భవించింది. బౌద్ధమతం, ధార్మిక ఆధ్యాత్మిక అంశంలో, బుద్ధగయ ఒక ప్రముఖ స్థానాన్ని పొందింది. బుద్ధగయ పర్యటన బౌద్ధమతం, అనేక ఇతర మతాల కు చారిత్రక కేంద్రంగా, అత్యంత ప్రమాణికతను అందిస్తుంది. బుద్ధగయ బౌద్ధులకు ప్రధాన యాత్రాస్థలం. బుద్ధగయ స్వంత ఆత్మా, శాంతి, మనోజ్ఞతతో నిండిఉన్న ప్రదేశం.

బుద్ధగయ చరిత్ర

గౌతమ బుద్ధుడు ఫాల్గు నది ఒడ్డున ఉన్న బోధి చెట్టుకింద ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చాడని బౌద్ధ పురాణాల కధనం. బుద్ధుడు తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అతని ప్రయత్నాన్ని ముగించి, అతని ప్రశ్నలకు సమాధానాలు పొందిన ప్రదేశమే ఈ బుద్ధగయ. ఈ స్థలం చరిత్ర ద్వారా నమోదుచేయబడింది, దీనికి సంబందించిన సూచనలను చైనీస్ యాత్రికుల ఫక్సియన్, జువాన్జాంగ్ పద్దులలో చూడవచ్చు. 13 వ శతాబ్దంలో టర్కిక్ సైన్యాలు దీనిని ఆక్రమి౦చే౦తవరకు ఈ ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా బౌద్ధ నాగరికతకు కేంద్రంగా ఉంది.

ఇటువంటి ప్రసిద్ధ దైవభక్తిగల బౌద్ధగాయ పర్యటన గొప్ప యత్రీకులలో ప్రముఖ స్థానంగా చోటుచేసుకుంది. బుద్ధుడు వెళ్ళిన అనేక శతాబ్దాల తరువాత, మౌర్య రాజు అశోకుడు బౌద్ధమతానికి గుర్తుగా పెద్ద సంఖ్యలో ఆరామానాలు, స్తంభాలను నిర్మించాడు. బరాబర్ కొండలలో ఉన్న బరాబర్ నిర్మాణ శోభ భారీ గంభీరమైన వంపులతో ఆ కాలానికి ఒక అడుగు ముందుగా రెండవ స్థానంలో ఉంది.

బుద్ధగయ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

మహాబోధి ఆలయం, విష్ణుపద ఆలయం, బోధి చెట్టు, దు౦గేశ్వరి గుహల ఆలయాలు దానితోపాటు జామా మసీదు బుద్ధగయ పర్యటనలో ఇతర ప్రధాన ఆకర్షణలు. బుద్ధగయ పర్యాటక౦ 80 అడుగుల బుద్ధ విగ్రహం, లోటస్ ట్యాంక్, బుద్ధ కుండ్, చైనీస్ ఆలయం & మొనాస్టరీ, బర్మీస్ గుడి, భూటాన్ బౌద్ధ విహారం, రాజయతన, బ్రాహమ్ యోని, అంతర్జాతీయ బౌద్ధ హౌస్ & జపనీస్ టెంపుల్, థాయ్ ఆలయం & మొనాస్టరీ, టిబెటన్ విహారం, ఒక పురాతత్వ మ్యూజియం వంటి అనేక ఇతర ఆకర్షణలతో కూడిన ఒక ఉత్తేజకరమైన ప్యాకేజిని కలిగిఉంది.

ఈ ఆకర్షణలు బుద్ధగయ అభివృద్ధిలో సాంప్రదాయ కధలను వివరిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి సన్యాసులు బౌద్ధ ప్రదేశాల పాదాల వద్ద కూర్చుని, పూర్తి ధ్యానంలో పవిత్ర గ్రంధాలను చదవడం చూడవచ్చు.

గ్రిధకుట రాజ్గిర్ కి వెళ్ళే మార్గంలో ఉంది.

ఈ స్థలం అత్యంత అద్భుతమైన విహంగ వీక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా, స్త్రీలు, పురుషులకు స్నానాలు చేయడానికి విడిగా ఏర్పాటు ఉన్న, ఔషధ గుణాలు కలిగిన నీటి బుగ్గలకు ప్రసిద్ది చెందిన రాజ్గిర్ హిల్స్ ని తప్పక చూడండి. బుద్ధగయ పర్యటన ఆకర్షణీయమైన, సుసంపన్నమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ స్థలాన్ని సందర్శించిన ప్రయాణికులు ప్రసాంతమైన కీర్తిని, మనోహరమైన భూమిని ఎక్కువగా ఇష్టపడతారు. బుద్ధుడు బోధించిన ప్రదేశం రాజ్గిర్, గయ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది, సందర్శకులు బుద్ధగయ నుండి ఒక చిన్న యాత్రను ప్రణాళిక వేయవచ్చు.

బుద్ధగయ లోని పండుగలు

బుద్ధగాయలో అత్యంత ప్రతిష్టాత్మక మైన గౌతమ బుద్ధుని పుట్టినరోజు బుద్ధ జయంతి ని ప్రతి సంవత్సరం మే నెలలో నిండి పౌర్ణమి రోజు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక బుద్ధ మహోత్సవాన్ని కూడా బుద్ధగయలో ఇతర ప్రధాన పండుగ. ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరి మాసాలలో ప్రపంచ శాంతికోసం కగ్యు మొన్లం చెంమో, న్యింగ్మ మొన్లం చెంమో వంటి ప్రార్ధన పండుగలను జరుపుకుంటారు. పరిశుద్ధత కోసం ప్రధానంగా కొత్త సంవత్సరంలో అనేక రోజులు ఆరామాల వద్ద మహాకాల పూజ నిర్వహిస్తారు.

బుద్ధగయ సందర్శనకు సరైన సమయం

అక్టోబర్ నుండి మార్చ్ వరకు బుద్ధగయ సందర్శనకు ఉత్తమ సమయం, పర్యాటకులు ప్రత్యేకంగా పండుగలకు హాజరవ్వాలి అనుకుంటే ఏ సమయంలోనైన ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

బుద్ధగయ చేరుకోవడం ఎలా

బుద్ధగయ, గయలో ఉన్న విమానాశ్రయం, సమీప రైల్వే స్టేషన్, రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. బుద్ధగయకు రైళ్ళు మార్గం అత్యంత సౌకర్యవంతమైనది. బస్ స్టాప్, నగరంలో లేదా సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ తో పోలిస్తే విమానాశ్రయం చాలా దూరం.

బుద్ధగయ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బుద్ధగయ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బుద్ధగయ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బుద్ధగయ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా బుద్ధగయ ప్రధాన బస్ స్టాప్, ఫాల్గు నది పై ఉన్న సుజాత వంతెన సమీపంలో ఉంది. గొప్ప ట్రంక్ రోడ్డు దారితో బాగా అనుసంధానించబడి ఉన్న గయా దీనికి సమీప రవాణా కేంద్రం. గయా, పాట్నా, ఇతర ప్రధాన నగరాల నుండి తరచుగా బస్సు సర్వీసులు నడుస్తాయి. బుద్ధగయ, NH83 జాతీయ రహదారికి అనుసంధానించబడి ఉన్న గయా నగరం నుండి షుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా గయా సమీప రైల్వే స్టేషన్, గయకు అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. బౌద్ధ పరిక్రమ రైలు బౌద్ధమత అన్ని ప్రధాన కేంద్రాలకు కలుపబడడం ద్వారా బౌద్ధ ధార్మిక పర్యాటకాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం బుద్ధగయ అంతర్జాతీయ విమానాశ్రయం గా కూడా పిలువబడే గయా అంతర్జాతీయ విమానాశ్రయం గయా రైల్వే స్టేషన్ నుండి షుమారు 10 కిలోమీటర్లు, బుద్ధగయ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బీహార్ లోని ఏకైక విమానాశ్రయం, ఇది చైనా, జపాన్, శ్రీలంక మొదలైన ఆసియా దేశాలతోపాటు ప్రధాన భారతదీయ నగరాలకు కూడా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat