Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుషినగర్

 కుషినగర్ - బౌద్ధ యాత్రా స్థలం !

21

కుషినగర్ ఉత్తరప్రదేశ్ లో బౌద్ధ యాత్రా స్థలాలలో ముఖ్యమైనది. బౌద్ధ గ్రంధాల ప్రకార౦, గౌతమ బుద్ధుడు అతని మరణం తరువాత హిరణ్యవతి నది సమీపంలో పరినిర్వానం పొందినట్లు ఉంది. గత కాలంలో దీనిని కుశావతి అని పిలిచేవారు, శ్రీరాముని కుమారుడైన కుశుడికి ఆపేరు పెట్టిన తరువాత దానికి ఆ పెరువచ్చినట్టు రామాయణ పురాణంలో పేర్కొనడం జరిగింది. అయితే, ఇది లోతైన బౌద్ధ మూలాల ద్వారా కీర్తిని పొందిందని ప్రధాన వాదన. 3 వ 5 వ శతాబ్దాల కాలంనాటి ఈ పట్టణం, అనేక పురాతన స్థూపాలకు, విహారాలకు నిలయం. ఈ స్మారక చిహ్నాలలో ఎక్కువ భాగం మౌర్య చక్రవర్తి అశోకుడు ఏర్పాటు చేసాడు. 19 వ శతాబ్దంలో దీనిని తిరిగి కనిపెట్టక ముందు, కుషినగర్ ఎక్కువ కాలం హింసాత్మక దాడుల కారణంగా శిధిలాల స్ధితిలో ఉండిపోయింది.

కుషినగర్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఖుషినగర్ లోని స్థలాలు, ఆకర్షనలలో ఎక్కువ భాగం బుద్ధునికి చెందినవే. ఈ స్థలాలు ఎక్కువగా బుద్ధుని చివరి రోజులను గుర్తుచేస్తాయి. మహాపరినిర్వాన ఆలయ౦లో 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకలిగిన బుద్ధుని విగ్రహం ఆనుకుని ఉంది. నిర్వాణ స్థూపం 1876 లో త్రవ్వకాలలో బైటపడింది. రామభార్ స్థూపం బుద్ధుని దహనం చేసిన ప్రదేశానికి గుర్తుగా ఉంది. అందమైన ధ్యాన పార్కులో కృత్రిమ నీటి వనరులు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల తోటలు ఉన్నాయి. కుషినగర్ మ్యూజియంలో త్రవ్వకాలలో బైటపడిన ఇళ్ళ అవశేషాలను ఉంచారు.

బౌద్ధుల ప్రధాన యాత్రా స్థలం కావడంతో, కుషినగర్ ప్రపంచం మొత్తం నుండి భక్తులను ఆకర్షిస్తుంది, వీరిలో అనేక మంది ఈ ప్రాంతాన్ని బౌద్ధ విశ్వాసాల గురించిన అధ్యయనానికి, పరిశోధనలకు ఆధారంగా చేసుకున్నారు. అనేకమంది ప్రజలు ఇక్కడ వారి సొంత దేవాలయాలను నిర్మించారు, ఉదాహరణకు, వాట్ థాయ్ ఆలయాన్ని బుద్ధునికి అంకితం చేసారు, కానీ దీని నిర్మాణ శైలి కష్టమైన థాయ్, భారతీయ శైలికి చాలా ప్రత్యేకంగా ఉంది. బుద్ధునికి అంకితం చేసిన చైనీయుల ఆలయం కూడా ఉంది, పేరుకు తగ్గట్లు అది చైనీయుల నిర్మాణ శైలితో విలక్షణంగా ఉంది. ఇండో-జపనీయుల ఆలయం రెండు ప్రత్యేకమైన నిర్మాణ శైలుల ఆసక్తికర మిశ్రమంతో కలదు.

ఇక్కడ బౌద్ధ ఆనవాళ్ళు కాకుండా, గుప్త పరిపాలన సమయంలో వాస్తవంగా నిర్మించిన ప్రసిద్ధ సూర్య దేవాలయానికి కూడా కుషినగర్ నిలయంగా ఉంది. అయితే, ఈ ఆలయం అనేక పునరుద్ధరణలకు గురైంది, వాటిలో చివరిది 1981 లో జరిగింది. ఈ ఆలయానికి ముఖ్యంగా జన్మాష్టమి సమయంలో భారీగా జనం వస్తారు.

తరువాత శివునికి అంకితంచేసిన కుబెర్ ఆస్థానం, జైన తీర్థంకరుల విగ్రహాలతో దేవ్రహ ఆస్థానం, హిందూ దేవతలకు అంకితమైన కురుకుల్ల ఆస్థానం వంటివి ఇక్కడి ఇతర ఆసక్తికర ప్రదేశాలు.

కుషినగర్ చేరుకోవడం

రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా కుషినగర్ చేరుకోవచ్చు.

కుషినగర్ సందర్శనకు ఉత్తమ సమయం

నవంబర్, మార్చ్ మధ్య కుషినగర్ సందర్శనకు ఉత్తమ సమయం.

 

కుషినగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుషినగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుషినగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుషినగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా కుషినగర్ 28 వ జాతీయ రహదారిపై ఉంది, ఇది రాష్ట్ర రవాణా సంస్థ వారు తరచుగా నడిపే బస్సుల ద్వారా ఉత్తరప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకి బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా ఇక్కడికి గోరఖ్పూర్, డోరియ సమీప రైల్వే స్టేషన్లు, ఇవి భారతదేశంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. అద్దె టాక్సీలలో మీరు కుషినగర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఇక్కడికి షుమారు 252 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో సమీప విమానాశ్రయం. కొన్ని విమానాలు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసియ విమానాశ్రయంలో, మరికొన్ని 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరఖ్పూర్ విమానాశ్రయంలో దిగుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon