ఇప్పుడు వసై కోటగా పిలువబడే బస్సేయిన్ కోట థానే జిల్లాలోని వసాయి గ్రామంలో వుంది. థానే కొండ చరియ వెంట పోర్చుగీస్ వారి తోలి స్థావరంగా బస్సేయిన్ ప్రసిద్ది పొందింది. బస్సేయిన్ కోట గా పిలువబడే ముందు దీన్ని వసాయి లోని సెయింట్ సెబాస్టియన్ కోటగా పిలిచేవారు.1532 లో నిర్మించిన ఈ ఐదువందల ఏళ్ళ నాటి కోటను అప్పటి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నిర్మించాడు. పోర్చుగీస్ వారు ఈ కోటను ఏర్పాటు చేసినా, అది భారతీయ రాజుల పాలనలోనే వుండేది. 1739లో దీన్ని మరాఠా పాలకులు చేజిక్కించుకున్నారు.బస్సేయిన్ ప్రాంతం అంతటికీ రక్షణ కల్పించేందుకు బస్సేయిన్ కోట ఉపయోగపడేది. ఇది దాదాపు 58000 మంది భారతీయ క్రైస్తవులకు, 60000 మంది స్థానికులకు, 2000మంది పోర్చుగీస్ వారికి ఆవాసం కల్పించేది.దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఈ కోట శిధిలావస్థలో వుంది. 4.5 కిలోమీటర్ల పొడవునా వున్న పేద్ద కోట గోడలూ, పోర్ట డ టెర్రా, పోర్ట డో మార్ అనే రెండు ద్వారాలు మాత్రం ఇప్పుడు మిగిలివున్నాయి.ఈ కోట ముఖద్వారాలు చాలా ఆకర్షణీయంగా వుండి, వాటి మీద అందమైన శాసనాలు వున్నాయి. దగ్గరలోనే వున్న పోర్చుగీస్ సమాధులు 1558 నాటివి.మూడు వైపులా సముద్రం వున్న ఈ కోట చుట్టూ వుండే ప్రాంతం చాలా రమణీయంగా వుంటుంది. బాలీవుడ్ లో చిత్రాలకు సెట్ గా ఈ ప్రదేశం ఇప్పటికీ పనిచేస్తోంది.



Click it and Unblock the Notifications