జవహర్, థానే

జవహర్ (లేదా జాహర్) తనే లో 10మీటర్ల ఎత్తున వున్న అందమైన పర్వత కేంద్రం. ఇది జిల్లా కేంద్రం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో వుంది.ఒకప్పుడు రాజ సంస్థానం అయిన జవహర్ ఇప్పుడు దట్టమైన పచ్చటి చెట్లతో, అక్కడక్కడా జలపాతాలతో అలరారుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజు సూరత్ వెళ్ళేటప్పుడు ఇక్కడ విడిది చేసారని చరిత్ర చెప్తోంది. ఈ అందమైన ప్రదేశంలోని అనుకూల వాతావరణం వల్ల జవహర్ ను థానే లోని మహాబలేశ్వర్ అంటారు. ఈ పర్వత కేంద్రంలో మహారాష్ట్ర లోని వారలి జాతికి ప్రత్యేకం, ప్రసిద్ధం అయిన ప్రసిద్ధ వారలి చిత్రాలు వుంటాయి.అందమైన దాద్రా కోప్రా, పలుసా జలపాతాలు, పురాతన భుపత్ ఘడ్ కోట, జయ విలాస్ పేలస్, అందమైన హనుమాన్ పాయింట్, సన్ సెట్ పాయింట్ ఇక్కడి చాలా ఆకర్షణల్లో కొన్ని.

Please Wait while comments are loading...