తలావ్ పాలీ (తలావ్ అంటే హిందీ లో సరస్సు) లేక మసుండా తలావ్ థానే జిల్లలో పెద్దదీ, ప్రసిద్ధమైనదీ అయిన సరస్సు. థానే లోని చాలా సరస్సులలో ప్రత్యేకమైన ఈ సరస్సు థానే నగర కేంద్రం నుంచి కేవలం 15 నుంచి 20 నిమిషాల దూరంలో వుంది.మహారాష్ట్ర లోని అందమైన సరస్సులలో ఒకటిగా ప్రసిద్ది పొందిన ఈ సరస్సు బోటింగ్, వాటర్-స్కూటర్లు లాంటి జలక్రీడావకాశాలు కలిగిస్తుంది. ఈ ప్రదేశం యాత్రికుల్లో చాల ప్రసిద్ది పొందింది – వారు ఇక్కడ ఏర్పాటయిన చాల ఆహారా శాలల్లో స్థానిక రుచులు చవి చూస్తారు.వారం అంతా పడిన శ్రమ నుంచి విముక్తి పొందడానికి కుటుంబాలతో వారాంతాల్లో ఈ సరస్సు ఒడ్డుకి చేరుకొని సరదాగా కాలక్షేపం చేస్తారు.మసుండా తలావ్ ఒడ్డున వున్న కోపినేశ్వర్ దేవాలయం థానే జిల్లా మొత్తంలోకి పురాతనమైన దేవాలయం. దీన్ని 1750 లో చిమజ్జి అప్పా నిర్మించి ఆధునీకరించాడు.



Click it and Unblock the Notifications