థానే లోని హెడ్ పోస్ట్ ఆఫీస్, ప్రిసన్ రిసర్వాయర్ కి దగ్గరలో సెయింట్ జేమ్స్ చర్చ్ అనే ఇంగ్లీష్ చర్చ్ ఉంది. 1825 లో కట్టిన ఈ చర్చ్ 200 సంవత్సరాల నాటిది.ఈ చర్చ్ గోతిక్ రీతిలోని వాస్తు శైలిని దృష్టిలో పెట్టుకొని నిర్మించారు. దీని కొలతలు 90 అడుగులు, 60 అడుగులు. ప్రధాన ద్వారము 15 అడుగుల పొడవుగల ఆరు స్తంభాలను కలిగిఉంది. 350 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక పెద్ద బలిష్టమైన ద్వారమును కలిగిఉంది. ఇది గ్రీకు రాయితో తయారుచేయబడి 24 అడుగుల ఎత్తులో ఉంది.ఈ చర్చ్ మధ్య భాగపు పైకప్పు కలపతో చేయబడి 24 అడుగుల ఎత్తు, 55 అడుగుల పొడవు, 33 అడుగుల పొడవుని కలిగిఉంది. చర్చ్ ఆవరణలో స్మశాన వాటిక ను చూడవచ్చు.స్వాతంత్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం చే నిర్వహించబడిన ఈ చర్చ్ ప్రస్తుతం బాంబే దయోసేసన్ ట్రస్ట్ అసోసియేషన్ వారి నిర్వహణలో వుంది.



Click it and Unblock the Notifications