సూరజ్ నీటి పార్క్ థానే లోని ప్రధాన ఆకర్షణ. మీరు జల ప్రేమికులు అయితే, వెంటనే థానే జిల్లాలోని అద్భుత జల విహార కేంద్రం సూరజ్ నీటి పార్క్ కు వెళ్ళండి. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ థానే నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జల స్వర్గం.పిల్లలకే కాకుండా కుటుంబ మొత్తానికి ఈ నీటి పార్క్ జల వినోదాన్ని అందిస్తుంది. ఇక్కడి నీటి జారుడు బల్లలతో బాటు, లబాక్ జపాక్ మతాక్, సింగ్ ఎ సాంగ్, రైన్ బో టవర్, డింగ్ డాంగ్ స్లైడ్స్, ధడకన్ వంటి జలక్రీడలు బోలెడు సరదాలను అందిస్తాయి. రిమ్ జిమ్ హాల్ ఉత్తేజ పరిచే వాన నృత్యాన్నిఅందించే డాన్స్ హాలు. 30 రకాల వివిధ ఫౌంటైన్ ల తో అలంకరించిన వేవ్ పూల్, లేజీ రివర్, ఫౌంటైన్ పార్క్ కూడా అందుబాటులో ఉన్నాయి.ఫైబర్ తో చేయబడిన శివ గుహ ప్రతిరూపం అలాగే, మనవ నిర్మిత హర హర గంగే జలపాతం సూరజ్ వాటర్ పార్క్ ను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఎక్కించిన ప్రధాన ఆకర్షణలు. దగ్గరలోని పురాతన ప్రదర్శన శాలా వివిధ రకాల తాళం కప్పలు, చెవులను ప్రదర్శిస్తుంది.ఈ పార్క్ అన్ని రోజులలో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరఛి ఉంటుంది. 4 అడుగుల ఎత్తు ఉన్న పిల్లలకు 250 రూపాయలు, పెద్దలు, నాలుగు అడుగులు పైన ఎత్తు ఉన్న పిల్లలకు 300 రూపాయలు ప్రవేశ రుసుముగా వసూలు చేసి సరదా నిండిన రోజుని ఇస్తారు.



Click it and Unblock the Notifications