తాన్సా అభాయారణ్యానికి దగ్గరలో వున్న తాన్సా సరస్సు చాలా అద్భుతంగా వుంటుంది. ఇక్కడి నీరు ప్రశాంతంగా వుండి ముంబై మహానగరానికి ప్రధాన నీటి వనరుగా పనిచేస్తోంది.ఈ సరస్సుకు మూడు మిలియన్ గాలన్ల నిల్వ సామర్ధ్యం వుంది – ఇందులో కొన్ని వేల గాలన్ల నీటిని ప్రత్యెక పైప్ లైన్ల ద్వారా ముంబై కి సరఫరా చేస్తోంది.ఈ సరస్సు జలవిస్తీర్ణం చాలా ఎక్కువ – సుదీర్గ విహార యాత్ర చేసి దీని ఒడ్డున విశ్రమించడానికి ఈ సరస్సు అవకాశం కపిస్తుంది. దీని ప్రశాంత, రమణీయ దృశ్యాలతో ఈ సరస్సు పర్యాటకుల్లో చాలా ప్రసిద్ది పొందింది.తాన్సా సరస్సుకి దగ్గరలో వున్న మాహులి కోట వాస్తు ప్రేమికులు తప్పని సరిగా చూడాలి.థానే నుంచి తాన్సా సరస్సుకి తేలిగ్గా చేరుకోవచ్చు – మాహులి గ్రామం నుంచి కేవలం పావుగంట ప్రయాణంతో చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications