థానే జిల్లలో ఉన్న తాన్సా అభయారణ్యం 320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వాడా, మోఖదాస్, షాహాపూర్ తాలూకాలలో విస్తరించి ఉంది.ఇక్కడి అభయారణ్యం వన్యప్రాణి ప్రేమికులను ఆహ్లదపరుస్తుంది. అరుదైన, అంతరించి పోతున్న వృక్ష, జంతు జాతులకు ఇది ఆలవాలం. ఇక్కడ దాదాపు 200 రకాల పక్షులు, 50 కన్నా ఎక్కువ జంతు జాతులు ఉన్నాయి.జంతువులలో, సంబారులు, హైనాలు, జింకలు, చిరుతలు, దుప్పులు, పాంథర్ లు, ముళ్ళ పందులు, తోడేళ్ళు, పులులు కలబడతాయి. కలంబా, బిబ్లా, ఖైర్, హెడ్, టేకు, వెదురు వంటి మొక్కలు కనబడతాయి.ఇక్కడికి దగ్గరలోని సూర్యమల్ ప్రాంతంలో వసతి సౌకర్యాలు ఉన్నాయి. అయితే, మీరు ఇక్కడికి వచ్చే ముందే వాటిని రిసర్వ్ చేసుకోవాలి.దగ్గర లోని తాన్సా సరస్సు, మహాదేవ దేవాలయం రెండూ చూడదగ్గ ప్రాంతాలు. నవంబర్ నుండి మే వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం.



Click it and Unblock the Notifications