థానే జిల్లాలోని తిత్వాలా గ్రామంలో ఈ మహాగణేష్ దేవాలయం ఉంది. ఇక్కడి విగ్రహం సిద్ది వినాయకుడిది కావడంవల్ల దేనిని సిద్ది వినాయక దేవాలయం గా కూడా వ్యవహరిస్తారు.ఈ మహాగణపతిని నిత్యం భక్తితో పూజిస్తే కోరుకున్న వారితో పెళ్లి అవుతుందని భక్తులు నమ్ముతారు.ఈ గుడి ఆవరణలో చిన్న శివాలయం ఉంది. దగ్గర లోనే రుక్మిణీ, విఠలుల దేవాలయం కూడా ఉంది.అందమైన ఈ పవిత్ర యాత్రాస్థలం వినాయక చవితి, అంగారక చతుర్థి పర్వదినాలలో వినాయకుడి ఆశీస్సుల కోసం బారులు తీరిన అసంఖ్యాక భక్తులతో కిటకిట లాడుతుంది.ఈ గుడి బైట చిన్న కృత్రిమ సరస్సు, దాని చుట్టూ అందమైన చిన్న తోట ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది.



Click it and Unblock the Notifications