మీరు ప్రకృతి ప్రేమికులైతే ‘థానే లో చూడాల్సిన మొదటి 20 ప్రాంతాల’ జాబితా లో ఎయూర్ కొండలు వుండాలి. మీరు ప్రకృతిని, ప్రశాంతత ను ప్రేమించేట్లయితే కాలుష్య రహిత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఎయూర్ కొండలు సందర్శించాలి.మామా అల్లుళ్ళ కొండలు గా పిలువబడే ఈ పర్వత కేంద్రం థానే లో ప్రసిద్ధ విహార కేంద్రం, అదీ వారాంతాల్లో అయితే చాలా రద్దీగా వుంటుంది. ఇక్కడ వున్న 150 ఏళ్ళ నాటి గుడి కూడా ప్రసిద్ది పొందింది.స్వామి మఠం ఇక్కడ చూసి తీరాల్సిన సంస్థల్లో ఒకటి. ఇక్కడి ప్రశాంతత, పరిసరాల నిశ్శబ్దం మీ ఇంద్రియాలను సేద తీరుస్తాయి. మీరు ఇక్కడికి వెళ్తే, పడమటి వైపున వున్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్ చూద్దాం మర్చిపోకండి.ఇక్కడి జంతు, వృక్ష జాతులను చూసి వన్య ప్రాణి ప్రేమికులు ఆనందిస్తారు. ఇక్కడ 12 జాతుల జంతువులూ, 78 జాతుల పక్షులూ వున్నాయి.



Click it and Unblock the Notifications