వాన్తాంగ్, మిజోరం రాష్ట్రంలోని అత్యంత పొడవైన జలపాతం. ఇది దేశంలోని అత్యంత పొడవైన జలపాతాలలో 13 వ స్థానంలో ఉంది. ఇది 229 మీటర్ల ఎత్తు నుండి ప్రవహించే రెండంచుల జలపాతం. తెన్జాల్ కి చాలా దగ్గరగా ఉన్న ఈ జలపాతాన్ని స్థానికులు వాన్తాంగ్ ఖావతలా అని పిలుస్తారు. ఇది సేర్చ్చిప్ నుండి 30 కిలోమీటర్లు, ఐజాల్ నుండి 137 కిలోమీటర్ల దూరంలో ఉంది.