Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువత్తర్ » వాతావరణం

తిరువత్తర్ వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో తిరువత్తర్ ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనకు ఇదే ఉత్తమ సమయం, ఎందుకంటే ప్రయాణానికి లేదా ప్రాంతాల సందర్శనకు మరీ చల్లగా ఉండదు లేదా మరీ వెచ్చగా కూడా ఉండదు. మధ్యాహ్నాలు వెచ్చగా ఉంటాయి కాని వేడిగా ఉండవు, సాయంత్రాలు ఆహ్లాదకర౦గా ఉంటాయి కాని చల్లగా ఉండవు.  

వేసవి

వేసవి కాలం కన్యాకుమారి జిల్లాలోని ఇతర ప్రాంతాల వలె తిరువత్తర్ కూడా మార్చిలో మొదలై మే నెల చివరి వరకు ఉండే వేడితో కూడిన వేసవిని కల్గి ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండి, మధ్యాహ్నాలు చాలా వేడిగా ఉంటుంది. గాలిలో తేమ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం తిరువత్తర్ ను వరుణదేవుడు జూన్ లో సందర్శించి సెప్టెంబర్ చివరి వరకు ఉంటాడు. ఈ ప్రాంతంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి, ఉష్ణోగ్రత ఆహ్లాదకరమైన 25 డిగ్రీల సెంటిగ్రేడ్ కు తగ్గిపోతుంది. అయినప్పటికీ పట్టణంలోని జలవనరుల వలన గాలిలో తేమ స్థాయి మాత్రం పెరుగుతుంది.

చలికాలం

శీతాకాలం తిరువత్తర్ లో శీతాకాలం చాలా ఆహ్లాదకర౦గా ఉంటుంది కారణం ఉష్ణోగ్రత తగ్గి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పడిపోవడమే కాక ఈ కాలంలో ఎక్కువ సమయంలో 23 డిగ్రీలకు పెరగదు. సాధారణంగా శీతాకాలం నవంబర్ చివరకు ప్రారంభమై ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ నెలలలో మధ్యాహ్నాలు వెచ్చగా ఉండి, సాయంత్రాలు ఆహ్లాదకర౦గా ఉంటాయి.