Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో చూడదగ్గ 6 ప్రశాంత ప్రదేశాలు !

ఇండియాలో చూడదగ్గ 6 ప్రశాంత ప్రదేశాలు !

By Mohammad

ప్రతిసారి అడ్వెంచర్ ప్రదేశాలను, సైట్ సీయింగ్ ప్రదేశాలను చూడాలనుకోవటం సాధ్యం కాదు. పండగలు, ఉత్సవాల సమయాలప్పుడు కూడా వెళ్లాలనుకోవటం ప్రేదేశాలను చూడటం సరికాదు (మీకు శబ్దాలు, ఆ సందడి ఇష్టం లేకపోతే). మీరు వీటన్నింటి నుండి ఎటైనా దూరంగా వెళ్లి ప్రశాంతంగా గడపటానికి నేటివ్ ప్లానేట్ కొన్ని ప్రదేశాలను అందిస్తున్నది.

ఈ వ్యాసం, ఇండియాలో ఉన్న ప్రముఖ ప్రశాంత పట్టణాలను, నగరాల గూర్చి తెలియజేస్తున్నది. అక్కడ మీ ప్రశాంతతకు ఎటువంటి భంగం వాటిల్లదు. అక్కడికి వెళ్లి మీరు మెడిటేషన్, యోగా, చదువుకోవటం, రుచులను ఆస్వాదించటం వంటివి చేపట్టవచ్చు. ఈ ప్రదేశాలు, మీకు ఎప్పుడూ ఉంటే శబ్ద కాలుష్యాల నుండి రిలాక్స్ ను ఇస్తాయి.

ఆరోవిల్లె, పాండిచ్చేరి

ఆరోవిల్లె, పాండిచ్చేరి

పాండిచ్చేరి నుండి 8 కి. మీ ల దూరంలో ఉన్న ఆరోవిల్లె ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది సాంస్కృతిక సామరస్యానికి, సామాజిక జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుండి వివిధ దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి సమీపంలో నివాస గృహాలను ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. స్త్రీ, పురుషులు యోగా, మెడిటేషన్, కల్చరర్ యాక్టివిటీ లలో పాల్గొంటారు.

ఇది కూడా చదవండి : పాండిచ్చేరి విహారం !

చిత్ర కృప : Aleksandr Zykov

పాన్గోంగ్ సరస్సు

పాన్గోంగ్ సరస్సు

జమ్మూ లోని పాన్గోంగ్ సరస్సు పక్షి ప్రేమికులకు, సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి చెందినది. సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. పక్షులను ప్రేమించేవారు ఈ సరస్సు వద్ద నిల్చుంటే పొడవాటి తలల బాతులు, సైబీరియన్ కొంగలు మరియు ఇతర జలచర పక్షుల విహంగాలను తిలకించవచ్చు.

మురిపించే పాన్గోంగ్ - మైమరిపించే కొండలు !

చిత్ర కృప : Photo Courtesy: Sreehari Sukumaran

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్, కేరళ

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్, కేరళ

దట్టమైన పచ్చటి అడవి 'సైలెంట్ నేషనల్ పార్క్'. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మన్నర్కాడ్ కు 20 కిలో మీటర్ల దూరంలో కలదు. ఈ ప్రదేశాన్ని మీరు ఒకసారి సందర్శిస్తే మీరు ఏమి పోగొట్టు కుంటున్నారో తెలుస్తుంది. దట్టమైన చెట్ల మధ్య పక్షులను చూస్తూ, ట్రెక్కింగ్ చేస్తూ ప్రశాంతతను, హాయిని పొందవచ్చు.

చిత్ర కృప : NIHAL JABIN

ఆగట్టి ద్వీపం, లక్షద్వీప్

ఆగట్టి ద్వీపం, లక్షద్వీప్

ఆగట్టి ద్వీపాన్ని 'లక్షద్వీపాల గేట్ వే' అని పిలుస్తారు. ఇక్కడికి నౌక లేదా విమాన మార్గం ద్వారా మాత్రమే చేరుకోచ్చు. ఆగట్టి ద్వీపంలో ఎన్నో నీటి క్రీడలను ఆడవచ్చు. స్కూబా డైవింగ్, స్నోర్కేలింగ్, ఫిషింగ్, బోటింగ్ మొదలైనవి. ఈ దీవిలో ఖరీదైన ఆల్కాహాలు చవక ధరకే దొరుకుతుంది.

ఇది కూడా చదవండి : సప్తద్వీప సుమధుర స్వప్నాలు !

చిత్ర కృప : icultist

మజులి, అస్సామ్

మజులి, అస్సామ్

మజులి, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న అస్సాం పర్యాటక ప్రదేశం. ఇది ప్రపంచములోనే అతి పెద్ద నదీ ద్వీపం. ఈ కాలుష్యరహిత ద్వీపంలో ఉన్న సహజ సౌందర్యాలు మిమ్మలను తప్పక ఆనందాన్ని కలిగిస్తాయి. నగర బిజీ లైఫ్ నుండి పారిపోవటానికి ఇదో చక్కటి ప్రదేశం.

ఇది కూడా చదవండి : మజులి - అతి పెద్ద నదీ ద్వీపం !

చిత్ర కృప : Kalai Sukanta

బ్యాక్ వాటర్స్, కేరళ

బ్యాక్ వాటర్స్, కేరళ

కేరళ బ్యాక్ వాటర్స్ లో హౌస్ బోట్ అద్దెకు తీసుకోండి. చల్లటి నీటి గాలులు అనుభవిస్తూ .. నోరూరించే సముద్రపు వంటలను హౌస్ బోట్ లో తినవచ్చు. అలప్పూజా, కుమారకోమ్ అనే రెండు ప్రదేశాలు ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉండి, మిమ్మలను రోజంతా ఆనందంగా ఉంచుతాయి.

కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

చిత్ర కృప : thraj1

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+