Search
  • Follow NativePlanet
Share
» » సిల్క్ సిటీ - మహిళలు కోరే పట్టు చీరలు !

సిల్క్ సిటీ - మహిళలు కోరే పట్టు చీరలు !

సేలం పట్టణం దక్షిణ భారత దేశం లోని తమిళ్ నాడులో ఉత్తర మధ్య భాగంలో కలదు. రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి ఈ పట్టణం 340కి.మీ. దూరం లో కలదు. సేలం ను మామిడి పండ్ల నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో ఇది ఐదవ పెద్ద పట్టణం. పురపాలక సంఘం కలిగి వుంది. చేరం భూ భాగం లోనిది అవటం వలన దీనికి ఈ పేరు చేరం అనే పదం నుండి వచ్చింది. పూర్వకాలం లో ఇక్కడి ప్రజలు మహిళల చీరలను నేత చేసేవారు. సేలం నేత చీరలకు ప్రసిద్ధి.

సూర్యాస్తమయ దృశ్యాలు

సూర్యాస్తమయ దృశ్యాలు

సేలం లో సూర్యాస్తమయం దృశ్యాలు అద్భుత ఆనందాలను అందిస్తాయి. సేలం పర్యటనలో ఇక్కడ సాయంత్రాలు చక్కగా ఆనందించవచ్చు.

Photos Courtesy : commons.wikimedia.org

వీధి అమ్మకాలు

వీధి అమ్మకాలు

చిన్న తరహా అమ్మకాలు చేసే వారు ఇక్కడ వీధులలో దుస్తులు అమ్మకం చేసి జీవనోపాధి పొందుతారు.
Photos Courtesy : commons.wikimedia.org

 చామంతులు, బంతులు

చామంతులు, బంతులు

సేలం పట్టణంలో చామంతులు, బంతి పూవులు విరివిగా లభిస్తాయి. ఈ పూవులు ప్రతి దుకానంలోను తప్పక వుంటాయి. మహిళలు ఈ రంగు రంగుల పూవులు బాగా ఇష్టపడుతారు.


Photos Courtesy : commons.wikimedia.org

పండ్లు, ఉసిరి కాయలు

పండ్లు, ఉసిరి కాయలు

సేలం పట్టణంలో మామిడి పండ్లు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ఈ సేలం మామి డి పండ్లు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి.


Photos Courtesy : commons.wikimedia.org

తారామంగళం టెంపుల్

తారామంగళం టెంపుల్

సేలం లో కల తారామంగళం టెంపుల్ ప్రసిద్ధ దేవాలయం. ఇది శివ భగవానుడికి అంకితం చేయబడినది. దేవాలయ ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా వుంటుంది. పురాతన మైన ఈ దేవాలయం పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.
Photos Courtesy : en.wikipedia.org

ప్రసిద్ధ తారా మంగళం టెంపుల్

ప్రసిద్ధ తారా మంగళం టెంపుల్

సేలం పట్టణంలోని తారామంగళం టెంపుల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సేలం వచ్చిన పర్యాటకులు ఈ దేవాలయం తప్పక చూస్తారు.

Photos Courtesy : en.wikipedia.org

రాజా గణపతి టెంపుల్

రాజా గణపతి టెంపుల్

సేలం పట్టణంలో కల మరొక ప్రధాన దేవాలయం రాజా గణపతి టెంపుల్. దీని ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Photos Courtesy : commons.wikimedia.org

పనమరతుపత్తి సరస్సు

పనమరతుపత్తి సరస్సు

సేలం పట్టణం లో కల పనమరతుపత్తి సరస్సు ప్రసిద్ధి చెందినది. పర్యాటకులు, స్థానికులు ఈ సరస్సు ఒడ్డున సాయంకాలాలు కుటుంబ సభ్యులతో కలసి ఒక విహార ప్రదేశంగా ఆనందిస్తారు.
Photos Courtesy : commons.wikimedia.org

వేయి లింగాల గుడి

వేయి లింగాల గుడి

సేలం పట్టణ సమీపంలో వేయి శివ లింగాలు ప్రతిష్టించిన దేవాలయం కలదు. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎంతో మహిమ కలదిగా చెపుతారు. అందమైన ఈ శివ లింగాలను ఈ సేలం పర్యటనకు వచ్చిన వారు తప్పక దర్శించి వస్తారు.

Photos Courtesy : commons.wikimedia.org

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+