Search
  • Follow NativePlanet
Share
» »కులు మనాలి - ఒక అద్భుత పర్యటన!

కులు మనాలి - ఒక అద్భుత పర్యటన!

పర్వత శ్రేనులలోకి తీసుకు పోయే ఇరుకైన సన్నని మార్గాలు వాటిలో అతి కష్టంగా కుదుపులతో ప్రయాణించే బస్సు లు. బస్సు ఒక్క సారి అటూ ఇటూ కుదుపులతో ప్రయాణిస్తూ వుంటే, ఒకవైపు రాతి ప్రదేశాలు మరోవైపు ప్రవహించే కొండల నీరు చూసేందుకు ఎంతో ఆహ్లాదకర దృశ్యంగా కనపడుతుంది. రాత్రులలో ప్రయాణిస్తూ వుంటే, చల్లని నీటి ప్రవాహాలు అతి చల్లనైన వెన్నెలలో మిల మిల మెరిసిపోతూ వుంటాయి. ఒక్కసారి ఆకాశంలోకి చూస్తె చాలు మినుకు మినుకు మనే లక్షలాది నక్షత్రాలు. స్వచ్చమైన, ఎట్టి కల్తీ లేని అద్భుత సహజ ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తూ వుంటుంది. మరి ఈ ప్రదేశం ఏమిటో తెలుసా ? అదే కులు మనాలి!!

కులు మనాలి అందం అంటే ఏమిటో పర్యాటకుడికి కొత్త నిర్వచనం తెలియచేస్తుంది. కులు మనాలి పర్యాటకుడికి కోరిన విశ్రాంతి లేదా కోరిన సాహస క్రీడలు అందిస్తుంది. కులు లోయ కు ఉత్తర కోసనున్న మనాలి, మంచుతో కప్పబడిన శిఖరాలతో, కనువిందైన దృశ్యాలతో నిండి ఉంటుంది. శబ్దార్ధం ప్రకారం మనాలి అంటే "మనువు గ్రహం" అని అర్ధం. పురాణాలలో ప్రపంచం నిట మునిగి ఉన్నప్పుడు బ్రతికి బయటపడ్డ వానిగా మనువును చెపుతారు. అతడు అప్పడు మనాలి వచ్చి మనిషి పుట్టుకను మరల తిరిగి ప్రారంభించాడని చెపుతుంటారు. అందుకే హిందువులకి మనాలి పవిత్రమైనది. ఇక్కడి దేవాలయాలని పుణ్య క్షేత్రంగా భావిస్తారు. చెఫ్ట్ నట్స్. చినార్స్, పొడుగాటి దేవదారు వృక్షాలు మనాలి కి వెళ్ళే దారి పొడవునా వుంటాయి. చుట్టూ ప్రక్కల అంతా ఎతైన శిఖరాలతో నిండి వుంది. వేసవిలో ట్రెక్కింగ్ కి, శీతాకాలంలో స్కయింగ్ కి ప్రసిద్ది. మీ కులు మనాలి పర్యటనలో తప్పక చూడదగిన ప్రసిద్ద పర్యాటక ప్రదేశాల కొన్ని చిత్రాలను అందిస్తున్నాం. పరిశీలించండి.

మనాలి మార్గం

మనాలి మార్గం

అద్భుత కులు మనాలి పర్యటన చండి ఘర్ నుండి వెళ్ళే రోడ్డుపై మొదలవుతుంది. మీ స్వంత వాహనం లేదా ప్రైవేట్ లేదా స్టేట్ బస్సు లలో ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. అధికమైన సౌకర్యం ఆసించ కండి.అద్భుత దృశ్యాలు చూడాలంటే కొన్ని సౌకర్యాలు కోల్పోక తప్పదు మరి.

Photo Courtesy: Felix Dance

గులబా

గులబా

గులబా ప్రదేశం రోహాతాంగ్ పాస్ వెళ్ళే మార్గంలో అందమైన అనేక ప్రకృతి దృశ్యాలు చూపుతుంది. వేసవి నెలల లో కార్లు లేదా బస్సు లలో వెళ్ళవచ్చు. వింటర్ లో మౌంటెన్ బైక్ లపై మాత్రమే సాధ్యమవుతుంది. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులను చూసి ఆనందించేందుకు ఇది ఒక అద్భుత విహార ప్రదేశం. బియాస్ నది మరిఉ పచ్చని మైదానాలు కూడా కలవు. ఇటీవలి కాలంలో గులబా అక్కడ కల సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందుతోంది. మీ అదృష్టం బావుంటే, ఒక అద్భుత సూర్యోదయం కూడా చూడవచ్చు.

Photo Courtesy: Jimish

సోలాంగ్ వాలీ

సోలాంగ్ వాలీ

కులు మనాలి చుట్టుపట్ల ప్రదేశాలలో సోలంగ్ వాలీ తప్పక చూడదగినది. ఇది కుల్లు మనాలికి 14 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ మీకు వేసవి మరియు వింటర్ సీసన్ క్రీడలు లభిస్తాయి. పారా గ్లైడింగ్, స్కయింగ్, పారా చూటింగ్, జోర్బింగ్, మొదలైనవి సీసన్ బట్టి చేయవచ్చు. రోప్ వే కార్ లో ఆకాశంలో విహరించటం ఒక వినూత్న అనుభూతి.

Photo Courtesy: Joginder Pathak

రోహాతాంగ్ పాస్

రోహాతాంగ్ పాస్

కులు మనాలి లో చూడదగిన ప్రదేశాలలో రోహాతాంగ్ పాస్ ఒకటి. రోహాతాంగ్ పాస్ అంటే 'శవాల సముదాయం' అని అర్ధం చెపుతారు. దీనికి కారణం ఇక్కడ కఠిన మైన వాతావరణానికి ఈ మార్గంలో అనేకమంది మరణిస్తూ వుంటారు కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఐనప్పటికీ మీరు అతి భద్రంగా చక్కని పర్యటనా జ్ఞాపకాలతో తిరిగి వస్తారు. ఖంగారు పడకండి. మనాలి నుండి రోహాతాంగ్ పాస్ కు 51 కి.మీ. ల ప్రయాణం. మార్గంలో జీనాబ్ మరియు బియాస్ నదులు చూడవచ్చు.

Photo Courtesy: J'ram DJ

పిరిడి

పిరిడి

పర్యటన లో పూర్తి ఆనందాలు కోరేవారికి పిరిడి సరైన ప్రదేశం. కులు మనాలి లో వైట్ వాటర్ రాఫ్టింగ్ పిరిడి లో మొదలవుతుంది. ఇది మనాలి కి 45 కి. మీ. ల దూరంలో కలదు. వేగంగా ప్రవహించే నీటిలో రెండు గంటల ప్రయాణం మిమ్మల్ని తాజా చేస్తుంది. ఇతర సాహస నీటి క్రీడలు కూడా ఇక్కడ కలవు.

Photo Courtesy: Kiran Jonnalagadda

బియాస్ కుండ్

బియాస్ కుండ్

బియాస్ కుండ్ , బియాస్ నది పుట్టిన ప్రదేశం. ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. ఫ్రెండ్ షిప్ పాయింట్, హనుమాన్ తిబ్బ వంటివి ట్రెక్కింగ్ మార్గాలు. మీరు బియాస్ నది తో పాటు ఇక్కడకల అనేక నీటి క్రీడలు కూడా ఆచరించవచ్చు. విశ్రాంతి కోరే వారు దుండి లో నక్షత్రాలు ఆనందిస్తూ కూర్చోనవచ్చు.

Photo Courtesy: Balaji.B

నగ్గార్ పాలస్

నగ్గార్ పాలస్

కులు మనాలి లో అనేక ఆకర్షణలు నగ్గార్ విలేజ్ లో కలవు. ఒక చిన్న కొండపై కల నగ్గార్ పాలస్ ఈ ప్రదేశ పురాహన సంస్కృతిని ప్రతి బిమ్బిస్తుంది. ఈ పాలస్ పూర్తి గాకొయ్య తో చేయబడిన శిల్ప శైలి కలిగి వుంటుంది. నగ్గార్ లో ఇంకనూ అనేక పురాతన దేవాలయాలు, కోతలు కొయ్యతో చేసినవి చూడవచ్చు.

Photo Courtesy: Richard Weil

వశిస్ట్ కుల్లు మనాలి

వశిస్ట్ కుల్లు మనాలి

వసిష్ట కులు మనాలిలో కల హాట్ స్ప్రింగ్ ఒక హిల్ స్టేషన్. ఇక్కడ అధిక హిమపాతం తో పాటు అధిక వేడి కూడా అనుభవించవచ్చు.
ఇక్కడ కొన్ని వేడి నీటి బుగ్గలు కలవు. మనాలి నుండి వసిష్ట విలేజ్ 6 కి.మీ.ల దూరంలో కలదు. దీని చుట్టూ పట్ల షాపింగ్ ప్రదేశాలలో మంచి డిస్కౌంట్ లాహో దుప్పట్లు కొనవచ్చు. స్థానికంగా జరిగే వివాహాలలో వారి సాంప్రదాయక డాన్స్ లు, పాటలు ఆనందించవచ్చు. ఇక్కడ కల టెంపుల్ కూడా ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: Vineet Timble

మనాలి టవున్

మనాలి టవున్

మనాలి టవున్ అనేక ప్రకృతి దృశ్యాలు కలిగి వుంటుంది. ఇక్కడ నుండి చుట్టుపట్ల కల పర్వత శ్రేణులు చూడవచ్చు. పొడవైన దేవదారు వృక్షాలు,వాటి మధ్య ప్రవహించే నీటి ప్రవాహాలు అద్భుత దృశ్యాలను అందిస్తాయి. టవున్ లో కాలినడకన ప్రయాణించి ఆనందించండి.

Photo Courtesy: Anoop Pandit

కులు మనాలి స్థానిక ఆహారాలు

కులు మనాలి స్థానిక ఆహారాలు

కులు మనాలి స్థానిక ఆహారాలు లో సత్తు (గోధుమ తయారీ), భాతూరా, జాటు (ఎర్ర బియ్యం) మరియు కొద్రా రోటి ప్రధానమైనవి. పాల పదార్ధాలు అధికంగా దొరుకుతాయి. రెగ్యులర్ చాయ్ మరియు అక్కడి స్పెషల్ ఫుడ్ అయిన టిబెటన్ మామో లు కూడా తప్పక తినండి.

Photo Courtesy: Saad Faruque

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+