Search
  • Follow NativePlanet
Share
» »జ‌ల‌పాత‌పు అందాలు.. ఆదిలాబాద్ సొంతం..!

జ‌ల‌పాత‌పు అందాలు.. ఆదిలాబాద్ సొంతం..!

జ‌ల‌పాత‌పు అందాలు.. ఆదిలాబాద్ సొంతం..!

తెలంగాణ రాష్ర్టంలోని ఆదిలాబాద్‌ జిల్లా సహజ అందాలకు ప్ర‌సిద్ధి గాంచింది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలతో వాతావరణం ఎప్పుడూ ఇక్క‌డ ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పొలాలు, అమాయక గిరిజనులతో ఈ ప్రాంతం ఇప్పుడు ప‌ర్యాట‌క కేంద్రంగా పేరుగాంచింది. ఇక ఈ జిల్లాలోని ఖండాల ప్రాంత అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్టం. ప్ర‌స్తుతం ఈ ప్రాంతం అందాలు ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. చూపు తిప్పుకోనికుండా చేస్తున్న ఈ ప్ర‌కృతి అందాల దృశ్యాల‌ను ప‌ర్యాట‌కులు తిల‌కించ‌డ‌మే కాకుండా వారి వారి కెమెరాల్లో బంధిస్తున్నారు. మ‌రీ మీరు కూడా ఈ ప్ర‌కృతి అందాల‌ను చూడాల‌నుకుంటున్నారా? అయితే, మ‌రెందుకాల‌స్యం చూసేయండి ఖండాల అందాలు..

1

చిన్న చిన్న జ‌ల‌పాతాలు..

ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాల అందాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. ఈ ప్రాంతంలో పేరుగాంచిన పెద్ద పెద్ద జలపాతాలే కాకుండా ఈ వర్షాకాలంలో మాత్రమే కనిపించే చిన్న చిన్న జలపాతాలు కూడా ప‌ర్యాట‌కుల‌ను కనువిందు చేస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి తోడు, ఎగువ ప్రాంతాల నుండి కొనసాగుతున్న వరద ఉధృతికి ఆయా జలపాతాలు జల కళను సంతరించుకుంటున్నాయి. కొండల మీది నుండి శబ్దం చేస్తూ కిందికి దూకుతూ జ‌ల‌పాతాలు సంద‌ర్శ‌కుల‌ను రా ర‌మ్మంటూ ఆహ్వ‌నం ప‌లుకుతున్నాయి.

2

జ‌ల‌పాత‌పు స‌వ్వ‌డులు..

పచ్చని వనాలకు ఆదిలాబాద్ జిల్లా పేరుగాంచింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల ప్రాంతంలో ప్రకృతి అందాలకు కొద‌వే లేదు. అడుగడుగున ఇక్క‌డి స‌హ‌జ అందాలు మ‌న‌కు తార‌స‌ప‌డ‌తాయి. వ‌ర్షాకాలంలో ఆ అందాలు మ‌రింత రెట్టింప‌వుతాయి. ఇక్క‌డి జ‌ల‌పాతపు స‌వ్వ‌డులు ఘాట్ రోడ్ల వెంట వెళ్లే ప్ర‌యాణికుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాయి. ఖండాల ప్రాంతం జిల్లా కేంద్రానికి సుమారు 25 నుండి 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సుమారు 850 మీటర్ల కంటే ఎత్తైనా ప్రాంతంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ సుందర దృశ్యాలు ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

3

మూడు జ‌ల‌పాతాలు..

ఖండాల ప్రాంతంలోని మొలలగుట్ట గ్రామ సమీపంలో మూడు జలపాతాలు ఉన్నాయి. ఇవి అంత‌గా ప్ర‌సిద్ధి చెంద‌క‌పోయిన ఇక్క‌డి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. కోపేన్ గిడి జలపాతం. గిరిజన దేవతలు మెచ్చిన సుందర ప్రాంతంగా ఈ జ‌ల‌పాతాన్ని గిరిజనులు భావిస్తారు. కోపేన్ గిడి జలపాతాన్ని అనుకొని మరో రెండు జలపాతాలు జలసవ్వడి చేస్తూ సాగుతుంటాయి. దారి పొడవునా ఎటు చూసినా మైమరిపించే ప్రకృతి అందాలు ఇక్క‌డ క‌నువిందు చేస్తాయి. ఇక్క‌డి కొండలపై నుండి కిందికి చూస్తే చిన్న చిన్న ఆదివాసి గిరిజన గూడాలు కనిపిస్తాయి.

మేఘాలు, పొగమంచు ఈ గూడాలను తాకుతూ వెళ్ళే దృశ్యాలను చూస్తే మ‌రో ప్ర‌పంచంలోకి మ‌న‌ల్ని తీసుకెళ్తాయి. ఇంత‌టి అద్భుత‌ దృశ్యాలను చూడాలంటే మాత్రం తెల్లవారుజామునే ఖండాలకు చేరుకుంటే చూడొచ్చు. ఖండాల అంద‌రికి అంతగా తెలియకపోయినప్పటికి ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం లభిస్తోంది. సెలవులు, వీకెండ్‌లో ప‌ర్యాట‌కులు ఇక్క‌డికొచ్చి ఈ ప్ర‌కృతి అందాల‌లో సేద‌తీరుతుంటారు. కేవ‌లం ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శిస్తున్నారు.

More News

    Read more about: adilabad telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+