Search
  • Follow NativePlanet
Share
» » భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు శిల్ప నైపున్యతలు అద్భుత నిర్మాణాలను సృష్టించాయి. సింధు నాగరికతల నుండి మొగలాయీ నిర్మాణాల వరకూ మొగాలాయీల పాల నుండి బ్రిటిష్ వారి పాలన వరకూ కూడా మన దేశంలో అనేక చారిత్రాత్మక నిర్మాణాలు వెలిశాయి. అనేక టెంపుల్స్, ఇతర నిర్మాణాలు ప్రపంచ ప్రజల దృష్టిని సైతం ఆకర్షించి, ఇండియా ను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా నిలిపాయి. మనదేశంలో కల కొన్ని అటువంటి అద్భుత నిర్మాణాలను పరిశీలిద్దాం !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

ఓడిషా లోని కోణార్క్ టెంపుల్ ఒక అద్భుత నిర్మాణ శైలి కలిగి వుంది. ఈ కోణార్క్ సన్ టెంపుల్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ లో రాతితో చెక్క బడిన 12 జతల చక్రాలు కలిగిన ఒక పెద్ద రధంపై సూర్య భగవానుడు ఉంటాడు. ఈ టెంపుల్ శిల్ప శైలి కళింగ రాజుల కాలంనాటి నిర్మాణ కౌశలం కలిగి ఖోండా లైట్ రాళ్ళ తో నిర్మించబడింది. ప్రతి రోజూ సూర్యుడు ఉదయించే సమయంలో మొదటి సూర్యకిరణాలు టెంపుల్ ప్రవేశ భాగాన్ని తాకుతాయి.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

ప్రపంచ వారసత్వ కట్టడం గా పేరొందిన ఆగ్రా లోని తాజ్ మహల్ తెల్లని పాలరాయితో నిర్మించబడింది. ఈ నిర్మాణం, ఒక ప్రేమ గుర్తు గానే కాక, అద్భుత శిల్పశైలి కలిగి వుంది. మొగలుల నిర్మాణంగా పేరొందిన ఈ తాజ్ మహల్ నిర్మాణంలో పర్షియన్, ఆటో మాన్ టర్కిష్ మరియు భారతీయ శిల్ప శైలులు కనపడతాయి.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భౌద్దుల యాత్రా స్థలం అయిన సాంచి లో కల సాంచి స్తూపం లో ఒక విశిష్ట నిర్మాణ శైలి కలదు. ఇది బుద్ధుడి జీవితం ప్రతిబింబిస్తుంది. దీనికి నాలుగు ప్రవేశాలు లేదా తోరణాలు... నమ్మకం, ధైర్యం, ప్రేమ, శాంతి వంటి వాటిని ప్రతిబింబిస్తూ ఉన్నత నిర్మాణ కౌశలం కలిగి వుంటాయి. బౌద్ధ మత నిర్మాణాలలో ప్రధానంగా బ్రాహ్మి లిఖిత శాసనాలు కల ఈ నిర్మాణం ఉత్తమమైనది. ఆ కాలంలో కట్టిన అనేక హిందూ నిర్మాణాలకు కూడా ఇది ఉదాహరణగా నిలిచింది.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

ఆగ్రా లో కల ఫతేపూర్ సిక్రీ, మొగలుల నిర్మాణ కౌశలానికి ఒక మంచి ఉదాహరణ. ఈ స్మారక చిహ్నం గుజరాత్ మరియు బెంగాల్ నిర్మాణ నైపుణ్యం కలిగి వుంది. ఫతేపూర్ సిక్రీ లో ఇస్లాం ప్రభావం కాక, హిందూ, జైన నిర్మాణ పనితనం కనపడుతుంది. ఎర్ర రాతితో కట్టిన ఈ నిర్మాణాన్ని తూహిర్ దాస్ అనే శిల్పి నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీ నిర్మాణంలో మొగలాయి చక్రవర్తి అక్బర్ గొప్ప ఆసక్తి కనపరచాడు.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ ఒక పద్మం పువ్వు ఆకారంలోని నిర్మాణం కలిగి అనేక అవార్డులు కూడా పొందింది. ఇది బహాయి మతస్తులకు ఒక యాత్రా స్థలం. బహాయి గ్రంధాలు ఈ అద్భుత నిర్మాణంలో ఒక భాగం వహిస్తాయి. దీనిని ఇరాన్ శిల్పి ఫారి బోర్జ్ షాబా రూపొందించాడు. పై భాగం అంతా తెల్లని పాల రాయితో నిర్మించగా, దీనికి 27 రేకులు పద్మంపూవు రేకులవలే నిర్మించారు.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

ఎల్లోరా లోని కైలాష్ టెంపుల్ భారతీయ టెంపుల్ నిర్మాణ శైలి కలిగి వుంటుంది. ఇది ద్రావిడ శిల్పశైలిని ప్రతిబింబిస్తుంది. ఈ రాతి శిల్పాలు పల్లవ రాజుల కాలం నాటివి. ప్రతి శిల్ప నిర్మాణంలోను, పై నుండి కింద వరకూ అద్భుత శిల్ప నైపుణ్యం కనపడుతుంది.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

జైసల్మేర్ కోట విశాలమైన థార్ ఎడారిలో ఇసుక తిన్నెల మధ్య ఎంతో బలంగా, హుందాగా నిలబడి కనపడుతుంది. గోడలు పసుపు ఇసుక రాతితో నిర్మించబడ్డాయి. ఇవి సూర్యుడి వెలుగుని బట్టి రంగులు మారుస్తాయి. రాజపుత్రుల నిర్మాణశైలిలో ఇవి ఉత్తమమైనవి. దీనినే బంగారు కోట అని కూడా అంటారు. ఇక్కడ మూడు వరుసల గోడలు కలవు. వీటిలో బయటిది మాత్రం గట్టి రాతితో కట్టబడినది.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

మీనాక్షి దేవత యొక్క టెంపుల్ అద్భుత నిర్మాణంలో 14 గోపురాలు వుంటాయి. వాటిలో ప్రధాన దేవతలకు కట్టబడినవి రెండు బంగారువి. టెంపుల్ యొక్క ఎత్తైన గోడలకు నాలుగు దిశలలోను నాలుగు ప్రవేశ ద్వారాలు వుంటాయి. ఈ నిర్మాణ ప్రత్యేకతలు తమిళ సాహిత్యంలో కూడా పేర్కొనబడ్డాయి. టెంపుల్ నగర మధ్యలో వుండి వీధులు టెంపుల్ కు మార్గాలు చూపుతూ పద్మం పూవు రేకులవలె వుంటాయి.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

చండి ఘర్ లోని చండీఘర్ శాసన సభ ఆధునిక నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. పంజాబ్ వేరు పడిన తర్వాత, ఇది నిర్మించబడినది కనుక నిర్మాణంలో గత సాంప్రదాయం, భవిష్యత్తు రూపం రెండూ కనపడతాయి. పెద్ద అసెంబ్లీ హాలు, హై కోర్ట్ బిల్డింగ్ లు నిర్మించిన దీని ప్రధాన శిల్పి లీ కార్బూయిసర్ చండి ఘర్ టవున్ నిర్మాణం వలెనె ఇది కూడా ఆ శిల్పి యొక్క పని నైపున్యమే.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

చత్రపతి శివాజీ టెర్మినస్ ను విక్టోరియ టెర్మినస్ అని కూడా అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల లో ఒకటి. అద్భుతమైన ఈ రైలు స్టేషన్ నిర్మాణం విక్టోరియన్ గోతిక్ స్టైల్ మరియు సాంప్రదాయ మొగల స్మారకాల నిర్మాణ శైలి కలిగి వుంటుంది. చెక్క నిర్మాణాలు, ఇత్తడి రైలింగ్ లు, పెద్దవైన మెట్లు వరుసలు ఈ రైలు స్టేషన్ లో వుంటాయి.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

అద్భుతమైన ఖజురాహో దేవాలయాల నిర్మాణం ఇసుక రాతితో చేసారు. పొడవైన స్తంభాలు, ఆర్చీలు రాతితో నిర్మించారు. కామ కేళి శిల్పాలు గోడలకు అలంకరంచారు. ఈ నిర్మాణాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశాలలో భాగంగాను, మరియు ఇండియా లోని ఏడు అద్భుతాలలో ఒకటి గాను పరిగనిస్తారు.

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

హస్సన్ నగర సమీపంలోని శ్రావణ బెలగళ లో కల గోమతేశ్వర విగ్రహం జైనుల యాత్రా స్థలం. అద్భుత శిల్పకళా నైపుణ్యానికి పేరు గాంచింది. సాంస్కృతిక నిర్మాణాలలో గోమాతేస్వర్ విగ్రహం ఉత్తమైనది. ఒకే గ్రానైట్ రాతి తో దీనిని నిర్మించారు. ఈ ఏకశిలా విగ్రహం ఒక పద్మపు పూవుపై నిలబడి వుంటుంది. విశిష్టమైన ఈ శిల్పకళల నైపుణ్యత నమ్మశక్యం కాదు. ఈ విగ్రహం ప్రపంచ ఏకశిలా విగ్రహాలలో అతి పెద్దది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+