Search
  • Follow NativePlanet
Share
» »మొఘల్ వాస్తుశిల్పానికి నిద‌ర్శ‌నం.. విక్టోరియా మెమోరియల్..!

మొఘల్ వాస్తుశిల్పానికి నిద‌ర్శ‌నం.. విక్టోరియా మెమోరియల్..!

భారతదేశంలోని అనేక నగరాలు తమ చారిత్రక కట్టడాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత‌గానో ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒకటి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న విక్టోరియా మెమోరియల్. భారతీయ, బ్రిటీష్ మరియు మొఘల్ వాస్తుశిల్పానికి ఇది అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవ‌చ్చు. అందుకే ఈ చారిత్రక వారసత్వాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఎంత‌గానో తాప‌త్ర‌య ప‌డుతుంటారు. ఈ చారిత్ర‌క క‌ట్ట‌డం గురించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకునే ప్ర‌యత్నం చేద్దాం..

విక్టోరియా మెమోరియల్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. భారతీయ, బ్రిటీష్ మరియు మొఘల్ వాస్తుశిల్పానికి ఇది ఒక ఈ ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తోంది. బ్రిటిష్ పాలనలో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం దీనిని నిర్మించ‌డం జ‌రిగింది. ఇది 1921 సంవత్సరంలో మ్యూజియంగా ప్రజల సందర్శనార్థం తెర‌వ‌బ‌డింది. బ్రిటీష్ ఆర్కిటెక్ట్ విలియం ఎమర్సన్ రూపొందించిన ఈ గ్రాండ్ మాన్యుమెంట్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను ఇప్పుడు చూద్దాం..

victoriamemorial

రాజకుటుంబం విశేషాలు..

వాస్త‌వానికి, 1901లో రాణి మరణం తర్వాత, వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ భవనాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇది 64 ఎకరాల విస్తీర్ణంలో తెల్లటి పాలరాతితో చేసిన గోపుర నిర్మాణం. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దీని పునాది రాయిని 1906లో వేశారు. దీనిని 1921లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చారిత్రక మ్యూజియం భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండ‌ర్‌లో ఉంది. ఈ మ్యూజియంలో రాజకుటుంబం యొక్క చారిత్రక సేకరణలు దాగి ఉన్నాయి. విక్టోరియా మెమోరియల్ యొక్క ఈ అందమైన నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనిని వీక్షించేందుకు భారతదేశం మరియు విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు త‌ర‌లి వ‌స్తుంటారు.

ప్ర‌త్యేక‌మైన ఏంజెల్ ఆఫ్ విక్టరీ విగ్రహం..

ఈ భవనం కేంద్ర గోపురం ఒక పెద్ద బాల్ బేరింగ్‌పై అమర్చబడింది. అందువ‌ల్ల ఇది గాలితో తిరుగుతున్న ఒక దేవదూత విగ్రహం వ‌లె ఉంటుంది. ఇక్క‌డి సెంట్రల్ డోమ్ చుట్టూ అనేక ఇతర కళాఖండాలు దాగి ఉన్నాయి, ఇవి న్యాయం, విద్య, జ్ఞానం, మాతృత్వం మరియు ప్రజా సంక్షేమ సందేశాన్ని అందిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహాల విగ్రహాలు పాలరాయితో చేసిన శక్తికి చిహ్నాలు. అంతేకాకుండా, ప్రధాన ద్వారం నుండి కొంత దూరంలో తోట మైదానంలో రాగితో చేసిన రాణి విగ్రహం ఒక‌టి ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇంగ్లండ్‌లో సర్ జార్జ్ ఫ్రాంప్టన్ తయారు చేశారు. ఈ విగ్ర‌హాన్ని సముద్ర మార్గం గుండా భారతదేశానికి తీసుకువచ్చారు.

victoriamemorial 1

రహస్య సందేశం.

విక్టోరియా బ్రిటన్ రాణి మరియు భారత సామ్రాజ్ఞి ద్వారం ద‌గ్గ‌ర ర‌హ‌స్య సందేశం రాసి ఉంటుంది. - 'డైయు ఎట్ మోన్ డ్రాయిట్' అంటే చక్రవర్తికి పాలించే హక్కు ఉందని అర్థం.

25 గ్యాలరీలు..

విక్టోరియా మెమోరియల్‌లో ఆయుధాలు, పెయింటింగ్‌లు మరియు ఇతర చారిత్రక వస్తువులతో పాటు 25 గ్యాలరీల పెద్ద సేకరణ కూడా ఉంటుంది. ఇందులో ఆనాటి నాణేలు, పటాలు మరియు తపాలా బిళ్ళలు ఇతర గ్యాలరీలలో కూడా ప్రదర్శించబడతాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ టూరిజం డిపార్ట్‌మెంట్ సైట్ ప్రకారం, ఇక్కడ ఉన్న చాలా పెయింటింగ్‌లు థామస్ మరియు విలియం డేనియల్ అనే చిత్రకారులచే రూపొందించబడిన‌వి తెలుస్తోంది. బ్రిటీష్ పాలనలో ఆయన ఎక్కువ సమయం భారతదేశంలోనే గడిపారని చెబుతుంటారు.

జోధ్‌పూర్ పాలరాయి స్మారక చిహ్నం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుండి తెచ్చిన మక్రానా పాలరాయితో విక్టోరియా మెమోరియల్ నిర్మించబడింది. ఈ మోమోరియ‌ల్ యొక్క ప్ర‌ధాన వాస్తుశిల్పి విలియం ఎమెర్సన్. ఆ సమయంలో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ అధ్యక్షుడిగా కూడా ఆయ‌న ఉన్నారు. దీని ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. ఏంజెల్ ఆఫ్ విక్టరీ ఎత్తు 16 అడుగులు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి దాదాపు రూ.1 నుంచి 1.25 కోట్లు ఖర్చు అయిన‌ట్లు తెలుస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+