Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ-ఒడిశా తీరంలో వాతావరణ అలజడి: వైజాగ్, శ్రీకాకుళం ప్రయాణికులు అలర్ట్! విమానాలు, రైళ్ల పరిస్థితి ఏంటి?

ఏపీ-ఒడిశా తీరంలో వాతావరణ అలజడి: వైజాగ్, శ్రీకాకుళం ప్రయాణికులు అలర్ట్! విమానాలు, రైళ్ల పరిస్థితి ఏంటి?

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ మరింత బలపడుతోందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది సెప్టెంబర్ 22, 23 తేదీల మధ్య ఆంధ్రా-ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 21న) వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడ, కళింగపట్నం, గోపాల్‌పూర్ వెళ్లే ప్రయాణికులు తమ విమాన, రైలు ప్రయాణ సమయాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి, బుధవారం నాటికి తీరానికి చేరువవుతుందని IMD అంచనా వేస్తోంది. అయితే ఇది తుఫానుగా మారే అవకాశం లేదని, తీరం దాటే సమయంలో తీవ్ర వాయుగుండంగానే ఉంటుందని స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు తీరం వెంట భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా మారి అలలు ఎగిసిపడతాయి. బీచ్‌ల వద్ద ఎరుపు జెండాలు ఎగురవేయడంతో పాటు వాటర్ స్పోర్ట్స్‌పై ఆంక్షలు విధించనున్నారు. కాబట్టి సముద్రంలో ఈతలు కొట్టడం, బోటు షికార్లు చేయడం, తీరంలోని కొండలపై సెల్ఫీలు దిగడం లాంటివి అస్సలు చేయవద్దు. హెచ్చరికలు ఉపసహరించే వరకు మత్స్యకారులు, ఓడరేవుల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ హార్బర్లకే పరిమితం కావాలి. బుధవారం ఉదయం తీర ప్రాంతంలో వాతావరణం చాలా తీవ్రంగా ఉండే అవకాశముంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, కళింగపట్నం, గోపాల్‌పూర్ ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

Andhra-Odisha Coast Weather Alert 2026: Travel Updates for Vizag, Srikakulam Flights and Trains

ఏపీ-ఒడిశా తీరానికి తీవ్ర వాయుగుండం: వైజాగ్ విమానాలు, కోస్టల్ రైళ్ల పరిస్థితి ఏంటి?

వైజాగ్ విమానాల్లో లేదా కోస్టల్ మార్గాల్లో రైలు ప్రయాణాలు ఉన్నవారు కనీసం 2 నుంచి 4 గంటల ముందే ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. విమానాల వేళల్లో ఏమైనా మార్పులు ఉంటే ఎయిర్‌లైన్స్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చెక్ చేసుకుంటూ ఉండండి. నేషనల్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టమ్ (NTES) యాప్ లేదా స్టేషన్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా రైళ్ల రాకపోకలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. బలమైన ఈదురుగాలుల వల్ల ప్రయాణికుల రక్షణ దృష్ట్యా రైల్వే శాఖ రైళ్ల వేగాన్ని తగ్గించడం లేదా నిలిపివేయడం చేస్తుంది. దీనివల్ల కనెక్టింగ్ రైళ్లను మిస్సయ్యే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితి కోసం ఉచిత క్యాన్సిలేషన్ సదుపాయం ఉన్న డే-యూజ్ హోటళ్లను విశాఖ ఎయిర్‌పోర్ట్ లేదా వాల్తేర్ స్టేషన్ సమీపంలో బుక్ చేసుకోవడం మంచిది.

ఏపీ-ఒడిశా తీరంలో బీచ్‌లు, పుణ్యక్షేత్రాల పర్యటన ప్లాన్ చేస్తున్నారా?

మంగళవారం నుంచి ఆరుబయట తిరిగే ప్లాన్లను రద్దు చేసుకుని, ఇండోర్ ప్లాన్లకు ప్రాధాన్యత ఇవ్వండి. విశాఖపట్నంలో బీచ్ రోడ్డు ప్రయాణాలకు దూరంగా ఉంటూ మ్యూజియంలు, కేఫ్‌లు లేదా సింహాచలం ఆలయాన్ని సందర్శించవచ్చు. కాకినాడ, శ్రీకాకుళంలో స్థానిక గుళ్లు, మార్కెట్లకు మాత్రమే వెళ్లడం మంచిది. గోపాల్‌పూర్, కళింగపట్నంలో అలల తీవ్రత ఎక్కువ కాబట్టి బీచ్ నడకలను పక్కనపెట్టడమే మంచిది. వృద్ధులతో ప్రయాణించేవారు లిఫ్టులు, వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే రాజమండ్రి లేదా విజయనగరంలో కాసేపు విశ్రాంతి తీసుకునేలా ప్లాన్ చేసుకోండి.

ఈ వారంలో తిరుపతి, శ్రీశైలం లేదా అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులు బుధవారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే సమయంలో వెళ్లడం మంచిది. దర్శనం, గదుల బుకింగ్స్ కోసం కేవలం అధికారిక యాప్‌లనే ఉపయోగించండి. రీఫండబుల్ ఆప్షన్స్ ఎంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాల కోసం IRCTC ద్వారా ఫ్లెక్సిబుల్ టికెట్లను బుక్ చేసుకోండి. ప్రయాణంలో రెయిన్ కోట్లు, పవర్ బ్యాంకులు, వాటర్‌ప్రూఫ్ పాదరక్షలు వెంట ఉంచుకోండి. అత్యవసర మందులు, స్నాక్స్, ఐడీ కార్డుల కాపీలు దగ్గర ఉంచుకుంటే క్యూ లైన్లలో నిలబడేటప్పుడు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

More News

    Read more about: astrology
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+