Search
  • Follow NativePlanet
Share
» »జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌కు వెళ్తున్నారా..? అయితే, ఇక్క‌డ స్టే చేయాల్సిందే..!

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌కు వెళ్తున్నారా..? అయితే, ఇక్క‌డ స్టే చేయాల్సిందే..!

దేశంలో ప్ర‌సిద్ధిచెందిన ఎన్నో పుణ్య‌క్షేత్రాలున్నాయి. ప్ర‌స్తుతం రెండు మూడురోజుల నుంచి పూరీలోని జ‌గ‌న్నాథ ఆల‌యం గురించిన వార్త‌ల‌నే మ‌నం వింటున్నాం..ఎందుకంటే, ఇక్క‌డ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌రైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర ప్రారంభ‌మైంది. ప్రతీ ఏటా ఇక్క‌డ‌ ఆషాఢమాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న (ఆదివారం) ఉదయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ఈ ర‌థ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఇది నేటి (సోమవారం) ఉదయం 4.59 గంటలకు ముగిసింది.

అయితే, పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌య ఆధ్వర్యంలో జరిగే అన్ని ఉత్సవాలన్నింటిలోకల్లా ఈ పూరీ జగన్నాథ రథయాత్ర ఎంతో విశిష్ట‌త‌ను సంత‌రించుకుంది. జులై 7వ తేదిన ప్రారంభ‌మైన ఈ ర‌థ‌యాత్ర పండుగ‌ను ప‌ది రోజుల పాటు నిర్వ‌హించుకుంటారు. అందుకోసం చాలామంది ఎక్క‌డిక్కెడి నుంచో ఇక్క‌డికి వస్తారు. అలాంటి వారికోసం ఇక్క‌డ హోట‌ల్స్, ధ‌ర్మ‌శాల‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలా త‌క్కువ ధ‌ర‌ల‌లో ల‌భించే ధ‌ర్మ‌శాల‌లు, హోట‌ల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

ప్ర‌తి ఏటా ఒడిశాల్లోని పూరీలో జూన్ లేదా జూలై మాసంలో ఈ ర‌థ‌యాత్ర‌ను నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్ల‌డం ఇక్క‌డి ఆన‌వాయితీ. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు.. 35 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంటుంది. ఈ రథానికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు క‌లిగి ఉంటాయి. సుమారు నాలుగువేల భ‌క్తులు ఈ రథాన్ని లాగుతారు.

jagannathsrathayatra

శ్రీ మందిర్ గెస్ట్ హౌస్

శ్రీ మందిర్ గెస్ట్ హౌస్ పూరి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉంటుంది. ఇది ఒక అతిథి గృహమ‌నే చెప్పుకోవాలి. ఇక్కడ ఏసీ, నాన్-ఏసీ గదుల సౌకర్యాన్ని పొందొచ్చు. అంతేకాదు, వ‌స్తువుల భద్రత కోసం ఇక్కడ లాకర్ స‌దుపాయం కూడా క‌లదు. ఇక్కడ రూమ్‌ల‌లో బాల్కనీలు కూడా ఉంటాయి. బాల్క‌నీ నుంచి గోల్డెన్ బీచ్ అందాల‌ను చూడొచ్చు. ఇక్క‌డికి స‌మీపంలో బేడి హనుమాన్ దేవాలయం కూడా ఉంది. ఇక్కడి నుండి ఆలయానికి మొత్తం దూరం 0.2 కిలోమీట‌ర్లు ఉంటుంది.

srimandirguesthouse1

శ్రీ గుండిచా భక్త నివాస్

శ్రీ గుండిచా భక్త నివాస్ అనేది శ్రీ గుండిచా పూరి సుప్రసిద్ధ ధర్మశాల. ఇది జగన్నాథ ఆలయానికి 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ ధర్మశాలలో అన్ని ర‌కాల అధునాత‌న సౌక‌ర్యాలు ఉంటాయి. ఇక్కడ ఆహారం, పార్కింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 120 రూపాయలకే స్వచ్ఛమైన శాఖాహారం ఇక్క‌డ లభిస్తుంది. ఈ ధ‌ర్శశాల‌లో కేవ‌లం 1000 రూపాయలతో AC గదిని బుక్ చేసుకోవచ్చు.

niladribhaktiniwas puri

నీలాద్రి భక్తి నివాస్

పూరీలో బస చేసేందుకు నీలాద్రి భక్తి నివాస్ ఉత్త‌మ‌మైన ప్ర‌దేశ‌మ‌ని చెప్పుకోవాలి. ఇది జ‌గ‌న్నాథుని ఆలయం నుండి సుమారు 550 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు పడకల AC డీలక్స్ గదిని పొందొచ్చు. దీని ధర సుమారు 1500 రూపాయలు. అందులో ఫుడ్‌తో పాటు 24 గంట‌ల వాట‌ర్ ఫెసిలిటి కూడా ఉంటుంది.

పురుషోత్తమ భక్త నివాసం

పూరి రైల్వే స్టేషన్ నుండి సుమారు 1.3 కిలోమీట‌ర్ల దూరంలో పురుషోత్తం భక్త నివాస్ ఉంటుంది. ఇక్కడ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. ఇక్కడ రెండు పడకల ఏసీ గది రూ.1400 నుంచి మొదలవుతుంది. ప్రత్యేక mattress కొనుగోలు చేస్తే ఛార్జీ పెరుగుతుంది. గదులలో అటాచ్డ్ బాత్‌రూమ్స్‌తో పాటు, ధర్మశాలలో లిఫ్ట్‌ సౌకర్యం కూడా ఉంది.

srisrimaanandmaiashram

శ్రీ శ్రీ మా ఆనంద్ మయి ఆశ్రమం

పూరీలో అతి త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన ఆశ్ర‌మాల కోసం చూస్తున్న‌ట్ల‌యితే మాత్రం శ్రీ శ్రీ ఆనందమయి ఆశ్రమం మంచి ఎంపిక. ఈ ఆశ్రమం స్వర్గద్వార్ బీచ్ నుండి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రెండు పడక గదుల AC, నాన్ AC గదిని పొందొచ్చు. ఇక్కడ ఏసీ రూం రూ.800, నాన్ ఏసీ రూం రూ.400లకు అందుబాటులో ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+