Search
  • Follow NativePlanet
Share
» »శ‌బ‌రిమ‌ల వెళ్తున్నారా..? అయితే, ఈ స్పెష‌ల్ ప్యాకేజీ మీకోస‌మే..!

శ‌బ‌రిమ‌ల వెళ్తున్నారా..? అయితే, ఈ స్పెష‌ల్ ప్యాకేజీ మీకోస‌మే..!

శబరిమల వెళ్లే భక్తులకు శుభ‌వార్త‌.. అయ్య‌ప్ప భ‌క్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శ‌బరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ట్రైన్ నవంబర్ 16వ తేదీన సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. అక్క‌డి నుండి శ‌బ‌రిమ‌ల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుకుంటుంది. ఈ మ‌ధ్య‌లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు స్టేష‌న్ల‌లో ట్రైన్ ఆగుతుంది. తిరిగి ఈ ట్రైన్ వ‌చ్చే (న‌వంబ‌ర్‌)నెల‌ 20వ తేదీన ప్రయాణమ‌వుతుంది.

రైల్వేశాఖ అందిస్తోన్న ఈ స్పెష‌ల్ ట్రైన్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు వివ‌రించారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి వ‌చ్చే నెల నుంచి భ‌క్తులు బారులు తీరుతారు. ఈ ఆల‌యానికి తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు వెలుతుంటారు. మరికొంతమంది మాల వేసుకోకుండానే అయ్యప్ప స్వామి దర్శనానికి బ‌య‌లుదేరుతారు. ఈ క్ర‌మంలో రైల్వేశాఖ ఈ స్పెష‌ల్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా టీ, టిఫిన్, భోజనం వంటి స‌దుపాయాల‌న్ని పొందొచ్చు.

sabarimala kerala

ధ‌ర‌లివే..

ఈ స్పెష‌ల్ ట్రైన్‌లో భాగంగా వీటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475 ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో అయితే, రూ.18,790 చెల్లించాలి. సెకెండ్ ఏసీలో అయితే రూ.24,215 గా నిర్ణయించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును ఉప‌యోగించుకోవాని రైల్వేశాఖ అధికారులు సూచించారు. అయితే, శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ‌ మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వేశాఖ‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఆల‌యానికి స్పెష‌ల్ ట్రైన్స్ న‌డ‌ప‌డం ఇదేమీ కొత్త‌కాదు. గతంలో కూడా శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను న‌డిచాయి.

sabarimala bookings

మకరజ్యోతి ద‌ర్శ‌నం..

శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో ఎక్కువ మంది భ‌క్తులు, ప్ర‌యాణికుల‌కు వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల నుంచి డిసెంబర్, జనవరి నెలలో ప్ర‌త్యేక రైళ్ల‌ను నడిపే అవకాశం ఉంది. మకరజ్యోతి అనేది శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ప్ర‌తి ఏటా మ‌క‌ర సంక్రాంతి రోజున నిర్వ‌హించే కార్య‌క్ర‌మం. దీనిని మ‌క‌ర‌విళక్కు అని కూడా పిలుస్తారు. మ‌క‌ర సంక్రాంతి రోజే ఆల‌యంలో ఈ జ్యోతి ద‌ర్శ‌న‌మిస్తుంది. అందుకే శ‌బ‌రిమ‌ల మకర జ్యోతి లేదా మకరవిళక్కు అని పిలుస్తారు. ఈ సంద‌ర్బంగా ఇక్క‌డికి లక్ష‌లాది మంది భ‌క్తులు కూడా త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ స‌మ‌యంలో చాలామంది అయ్య‌ప్ప భ‌క్తులు మాల‌లు కూడా ధ‌రిస్తారు. మాల‌లు వేసిన స్వామివార్లు అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకునేందుకు బారులు తీరుతారు.

మూడుసార్లు మాత్ర‌మే..

మకరజ్యోతి సమయంలో ఆల‌యంలో రద్దీ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, జ్యోతి దర్శనానికి వచ్చే అయ్య‌ప్ప భక్తులు మాత్రం తమ దర్శనాన్ని సరిగ్గా ప్ర‌ణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, స్వామి ద‌ర్శ‌నానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. శబరిమల మకరజ్యోతి ఘట్టం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మాత్ర‌మే ఉంటుంది. ఈ కార్యక్ర‌మాన్నిశబరిమల కొండపై నిర్వ‌హిస్తారు. శబరిమల మకరజ్యోతి దర్శనం వేళ ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలోనే మ‌క‌ర జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

More News

Read more about: sabarimala ayyappa darshan news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+