Search
  • Follow NativePlanet
Share
» »వింట‌ర్‌లో హ‌నీమూన్ ప్లాన్ చేస్తున్నారా...కేర‌ళ‌లోని బెస్ట్ ప్లేసెస్ ఇవే..

వింట‌ర్‌లో హ‌నీమూన్ ప్లాన్ చేస్తున్నారా...కేర‌ళ‌లోని బెస్ట్ ప్లేసెస్ ఇవే..

కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు త‌మ జీవిత భాగ‌స్వామితో స‌రాదాగా గడిపేందుకు హానీమూన్‌కు వెళ్తుంటారు. ముఖ్యంగా వింట‌ర్ సీజ‌న్‌లో హానీమూన్‌కు వెళ్లేవారు హిల్‌స్టేష‌న్ల‌ను ఎక్కువ‌గా ప్రాముఖ్య‌త‌నిస్తుంటారు. అలాంటి జంట‌లు విహ‌రించేందుకు భార‌త‌దేశంలో చాలా ప్ర‌దేశాలే ఉన్నాయి. ఇక‌, కేర‌ళ‌లో ఇలాంటి ప్ర‌దేశాల‌కు కొద‌వేలేదు.. ఇక్క‌డి బీచ్‌ల‌లో స‌ర‌దాగా విహ‌రిస్తూ, అద్భుతమైన పర్వత ప్రాంతాల‌ను వీక్షించొచ్చు. ఇంకా బోటులో షికార్లు కూడా చేయొచ్చు. ఇక్క‌డ అనేక అంద‌మైన ప్ర‌దేశాలు ఉంటాయి. ఈ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఎంతో ఆనందంగా గ‌డపొచ్చు. రండి కేర‌ళ‌లోని ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం..

alleppy , kerala

అలెప్పీ

హ‌నీమూన్‌కు వెళ్లేవారు కేర‌ళ‌లో సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాల‌లో ముఖ్యంగా అలెప్పి ఉంటుంది. ఈ ప్ర‌దేశం దేశ‌విదేశాల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్రాంతమంతా ప‌చ్చ‌ని తీవాచి ప‌ర‌చిన‌ట్లు ఉంటుంది. ఎటుచూసినా క‌నిపించే కొబ్బ‌రిచెట్లు ప‌ర్యాట‌కుల‌ను ప‌ల‌కరిస్తూ ఉంటాయి. అంద‌మైన బీచ్‌ల‌తో పాటు హోస్ బోట్ ప్ర‌యాణాన్ని కూడా ఇక్క‌డ ఆస్వాదించొచ్చు. ఇక‌, పెళ్ల‌యిన కొంత‌జంట‌లకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా సౌక‌ర్యవంతంగా ఉంటుంది.

కోవ‌ళ‌మ్ బీచ్‌

కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు సంద‌ర్శించేందుకు కోవ‌ళ‌ము బీచ్ ఎంతో బాగుంటుంది. స‌ముద్ర‌పు అల‌ల తీరాన భాగ‌స్వామితో క‌లిసి మీ విష‌యాల‌ను పంచుకోవ‌చ్చు. కేరళలోని తిరువనంతపురంలో అరేబియా సముద్రానికి చేరువలో ఉన్న తీర పట్టణం కోవలం. ఇక్క‌డ అన్నిర‌కాల స‌ముద్ర‌పు ఆహారాన్ని రుచి చూడొచ్చు. ఇంకా ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనేక ర‌కాల ప్ర‌దేశాలున్నాయి. పద్మనాభపురం ప్యాలెస్, కరమన్ నది, వెల్లయని సరస్సులు ఇక్కడి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు. సాయంత్రం సమయంలో ప్ర‌త్యేక‌మైన లైట్ హౌస్ బీచ్ అందాల‌ను తిల‌కించాల్సిందే. అలాగే శంఘుముఖం బీచ్ కూడా ఎంతో ఆహ్లాద‌భరితంగా ఉంటుంది.

waynad hill stations

వ‌య‌నాడ్‌

ప్రకృతి ఒడిలో జీవిత భాగస్వామితో క‌లిసి విహ‌రించాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా కేర‌ళ‌లోని వ‌యానాడ్‌ను సంద‌ర్శించాల్సిందే. హ‌నీమూన్‌కు వెళ్లే జంట‌ల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌లో కొ్త్త జంట‌లు ఎంతో స‌ర‌దాగా గడిపేయొచ్చు. ఇంకా ఇక్క‌డ విభిన్నర‌కాల వ‌న్య‌ప్రాణుల‌ను చూడ‌డంతో పాటు బోటింగ్ వంటి సాహ‌స కార్య‌కలాపాల‌ను కూడా చేయొచ్చు. వ‌య‌నాడ్‌కు స‌మీపంలో ఉండే ఊటీ, కూర్గ్, కన్నూర్, మైసూర్ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలను కూడా సంద‌ర్శించొచ్చు.

కుమారకొం

హ‌నీమూన్ జంట‌ల‌కు కేర‌ళ‌లోని మ‌రో ఉత్త‌మ గ‌మ్య‌స్థానం కుమార‌కొం. ఈ ప్ర‌దేశం కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు విహ‌రించేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్క‌డి స‌ర‌స్సుల‌లోని బోట్‌ల‌లో ప్ర‌యాణం చేయొచ్చు. ఈ ప్రాంతం చుట్టూ ఎటు చూసినా ప‌ర్యాట‌కుల‌కు ప‌చ్చ‌ని అందాలే తార‌స‌ప‌డ‌తాయి. అనేక వృక్ష‌, జంతు జాలాల‌ను ఇక్క‌డ మ‌నం చూడొచ్చు. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఎన్నో పురాత‌న ఆల‌యాలు, వేల చ‌రిత్ర క‌లిగిన మ్యూజియంలు కూడా ఉన్నాయి. అవి ప‌ర్యాట‌కుల‌ను కొన్ని వేల సంవ‌త్స‌రాల వెన‌క్కి తీసుకువెళ‌తాయి. ఇక్క‌డి జ‌ల‌పాతాల్లో జ‌ల‌కాల‌డొచ్చు.

munnar , winter

మున్నార్

కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు విహ‌ర‌యాత్ర‌కు వెళ్లేందుకు కేర‌ళ‌లోని మున్నార్ ఎంతో అద్భుత‌మైన ప్ర‌దేశమ‌ని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డ ప్రకృతి అందాలతో కూడిన సరస్సులు ఎన్నో ఉంటాయి. ఇంకా ఇక్క‌డ ఎటుచూసిన క‌నిపించే ప‌ర్వ‌తాలు, జ‌లపాతాల స‌వ్వ‌డుల‌తో ఈ ప్ర‌దేశం ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది. ఇక్క‌డి టీ ఎస్టేట్‌లు కూడా సంద‌ర్శించ‌ద‌గ్గ ప్ర‌దేశాలే. మున్నార్‌లో ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న‌కు ఎరవికులం నేషనల్ పార్క్, కుండల సరస్సు, టీ మ్యూజియం వంటి వివిధ ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా భాగ‌స్వామితో క‌లిసి న‌డిచేందుకు ఇక్క‌డ ఎంతో అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+