Search
  • Follow NativePlanet
Share
» »మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

భార‌త్‌లో ప‌ర్యాట‌కుల‌కు సంద‌ర్శించేందుకు గొప్ప ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఇక్క‌డ అతిపురాత‌న‌మైన కోటలు, చారిత్ర‌క క‌ట్ట‌డాలు, ఆధ్యాత్మికత ప్ర‌దేశాలు ఇలా ఒక్క‌టేమీటీ మ‌రెన్నో ఉన్నాయి. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌ను చూడాల‌నుకునేవారి కోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ వివ‌రాలేంటో చూసేద్దాం...

ఐఆర్​సీటీసీ మ్యాజికల్​ మధ్యప్రదేశ్ పేరుతో ఈ ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఈ ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. రైలు మార్గంలో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా భోపాల్​, జబల్​పూర్​, పచ్మార్హి వంటి ప్రదేశాలను సంద‌ర్శించే అవ‌కాశం ఉంటుంది.

madhya pradesh bike ride

టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ టూర్ షెడ్యూల్‌లో భాగంగా మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్​ నుంచి సంపర్క్​ క్రాంతి ట్రైన్​ బయలుదేరుతుంది. రాత్రంతా జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం 8 గంటలకు భోపాల్​ చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యాక సాంచికి ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. అనంత‌రం అక్క‌డి నుండి భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ దర్శనానికి వెళ్తారు. అక్క‌డి నుండి తిరిగి భోపాల్​ చేరుకుంటారు.

అదే రోజు సాయంత్రం ట్రైబల్​ మ్యూజియం సంద‌ర్శ‌న ఉంటుంది. ఇక‌, ఆరోజంతా భోపాల్​లోనే స్టే చేయాల్సి ఉంటుంది. మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ ముగిసాక పచ్మార్హికి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక ఫ్రీ టైమ్​లో అక్కడి ప్రాంతాలు చూసే అవ‌కాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ నైటంతా హోటల్​లో బ‌స చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ ముగిసాక‌ పాంచ్​​ పాండవ్​ కేవ్స్, జట శంకర్​ టెంపుల్​ దర్శ‌నం చేసుకుంటారు. వీటితోపాటు బీ ఫాల్స్​, సన్​సెట్​ పాయింట్​ వంటి ప్ర‌దేశాలను కూడా చూస్తారు. అనంత‌రం తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. ఇక‌,
ఐదో రోజు ఉదయం అల్పాహారం ముగించుకుని జబల్​పూర్​ బయలుదేరుతారు.

dawki river

అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన అయ్యాక‌, మధ్యాహ్నం మార్బుల్​ రాక్స్​, ధుంధర్ జలపాతం వంటి ప్ర‌దేశాలు విజిట్​ చేస్తారు. అనంత‌రం జబల్​పూర్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్​కు తిరుగు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది.
ఇక‌, ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్​కు చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఐఆర్‌సిటిసి ప్యాకేజీలో భాగంగా వీటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ.23,940 చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్రిపుల్​ షేరింగ్​కయితే రూ.18,290గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులక‌యితే విత్​ బెడ్​ అయితే రూ.13,430చెల్లించాల్సి ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.11,810గా నిర్ణ‌యించారు.

mountains mp

ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 4, 18, నవంబర్​ 1, 15, 29వ తేదీల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్​ టికెట్లు, ప్యాకేజీని బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​, బ్రేక్​ఫాస్ట్​తో కలిపి 3 రోజులు అకామిడేషన్, ట్రావెల్​ ఇన్సూరెన్స్​వంటివ‌న్నీ క‌వ‌ర్ అవుతాయి.
ఇక‌, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇత‌ర పూర్తి స‌మ‌చారం కోసం ప్ర‌యాణికులు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+