వర్షాకాలంలో విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి తెలంగాణలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పచ్చని పొలా ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనుకునేవారు తప్పకుండా రాష్ట్రంలోని వరంగల్‌కు సమీపాన ఉన్న మాధన్నపేట చెరువుకు వెళ్లాల్సిందే. నగరజీవితానికి దూరంగా పచ్చని పైర్ల మధ్య ఉండే అందమైన చెరువే మాధవన్న పేట చెరువు. ఇది వరంగల్ జిల్లాలని నర్సంపేట పట్టణం సమీపంలో ఉంటుంది. కుటుంబసభ్యులతోపాటు ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు.
వర్షాకాలంలో ఇక్కడి అందాలు మరింత రెట్టింపవువతాయి.ఇక్కడి వాతావరణం సిటీగా దూరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈచెరువు ఎప్పుడూ జలకళను సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ చెరువు ఇప్పడు నిండుకుండలా మారింది. దీంతో ఈ ప్రాంతాన్ని చూసేందుకు సమీపంలోని నర్సంపేట, వరంగల్, హనుమకొండ నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఇక, చిన్నారులయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు.
మాదన్నపేట చెరువు విస్తీర్ణం సుమారు 2300 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉండేది. కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతానికి బోటింగ్‌ను ఆపివేశారు. వర్షాల అనంతరం మళ్లీ బోటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బోటింగ్ ఉంటే ఈ చెరువును 15 నిమిషాల్లో చుట్టిరావొచ్చు.

మాధన్నపేట చెరువు కింద సుమారు ఎనిమిదివేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక, ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు చెరువు కట్టపైనుంచే చూస్తే కనుచూపు మేర నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. అందుకే చాలామంది వర్షాకాలంల వీకెండ్స్‌లో విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇది ఒక పిక్నిక్ స్పాట్‌గా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరొందింది.
చెరువు కట్టపై వెలసిన శివాలయం...
అంతేకాదు, ఇక్కడ ప్రసిద్ధిచెందిన శివాలయం కూడా ఉంది. మాధన్నపేట చెరువు కట్టపై మహాశివుని పుణ్యక్షేత్రం వెలసింది. ఈ చెరువును వీక్షించేందుకు వచ్చే వారు తప్పకుండా మహాదేవుని దర్శనం చేసుకుంటారు. ఇక, ఈ శ్రావణ మాసాల్లో అయితే, ఆలయానికి చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులసంఖ్య అధికంగా పెరిగిపోయింది. పండగల సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ప్రాంతమంతా ప్రత్యేక సందర్భాల్లో శివనామస్మరణతో మారుమోగుతుంది. మాధన్నపేట చెరువులో స్నానం చేసి శివరాధన చేస్తుంటారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పర్యాటకులకు, భక్తులకు అందుబాటులో ఉంటుంది.

చేరుకోవడం ఎలా..?
మాధన్నపేట చెరువును చేరుకునేందుకు అన్ని రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి బస్సులు నిత్యం వరంగల్‌కు అందుబాటులో ఉంటాయి. వరంగల్‌లో సమీప రైల్వేస్టేషన్ కూడా ఉంది. బస్ను మార్గంలో వచ్చేవారు ముందుగా వరంగల్‌కి చేరుకుని అక్కడి నుంచి మాధన్నపేట చెరువు సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వరంగల్ వరకు ట్రైన్ ద్వారా వచ్చినట్లయితే, అక్కడి నుంచి నర్సంపేటకు బస్సులో రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నర్సంపేట నుంచి మాధన్నపేట చెరువుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వెహికల్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వరంగల్ నుంచి నేరుగా నర్సంపేట వరకు వచ్చి, అక్కడి నుంచి మాధన్నపేట చెరువుకు చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













