Search
  • Follow NativePlanet
Share
» »Arunachal Pradesh Statehood Day: అరుణాచల్‌లోని ఈ ప్రదేశాల‌ను వీక్షించాల్సిందే..

Arunachal Pradesh Statehood Day: అరుణాచల్‌లోని ఈ ప్రదేశాల‌ను వీక్షించాల్సిందే..

భారతదేశంలోని అందమైన ప్రదేశాలలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక‌టిగా చెప్పొచ్చు. ఈ రాష్ట్రం సంస్కృతి, ఆహారం, వాతావరణం వరకు ప్రతిదానిలో భిన్నంగా ఉంటుంది. ప‌చ్చ‌ని ప‌రిస‌రాల‌కు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి ఈ ప్రాంతం ప్ర‌సిద్ది. ఈ ప్రాంతాన్ని తూర్పు సూర్యోదయం అని కూడా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరి 20న దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఫిబ్రవరి 20, 1987న‌ అరుణాచల్ ప్రదేశ్ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 1972 వరకు ఈ రాష్ట్రాన్నినార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. అరుణాచల్ ప్రదేశ్ దాని ప్రత్యేక సంస్కృతి, ఆహారం, సాంస్కృతిక వారసత్వం మరియు అందాలకు ప్రసిద్ధి చెందింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల గురించి తెలుసుకుందాం ప‌దండి.

రోయింగ్

రోయింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాధారమని చెప్పొచ్చు. ఇక్క‌డ‌ స్వచ్ఛమైన నదులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సులు మరియు జలపాతాలు ఈరాష్ట్ర అందాన్ని మ‌రింత పెంచుతాయి. ఫిబ్రవరిలో ఇక్కడ ఒక పండుగ కూడా నిర్వ‌హిస్తారు. ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు. రోయింగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ లోయలో ఉంది. రోయింగ్ అనేది సాహస ప్రియులకు మరియు ప్రకృతి ప్రేమికులకు గొప్ప ప్రదేశం.

changlong

చాంగ్లాంగ్

అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం అరుణాచల్ ప్రత్యేక సంస్కృతి మరియు సంప్రదాయాలను కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుండి చాంగ్లాంగ్ వరకు 307 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇది చాంగ్లాంగ్ సముద్ర మట్టానికి 200 మీటర్ల నుండి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి ఎంతో అనువైన‌దనే చెప్పుకోవాలి.

మెచుకా లోయ

మెచుకా వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎంతో సుంద‌ర‌మైన‌ హిల్ స్టేషన్. ఇది షి-యోమి జిల్లాలో ఉంటుంది. మెచుకా వ్యాలీ సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఎంతో ఉత్త‌మం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రంగుల సంస్కృతిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఇక్క‌డికి రావాల్సిందే. ఈ ప్రదేశాన్ని "మినీ స్విట్జర్లాండ్" అని కూడా అంటారు. మెచుకాకు వచ్చిన తర్వాత, డోర్జిలింగ్ విలేజ్, హనుమాన్ పాయింట్, గురునానక్ తపోస్థాన్, గురుద్వారా, న్యూ గొంప, మెచుకా బస్తీ, సామ్టెన్ యోంగ్చా మొనాస్టరీ వంటి ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలున్నాయి.

rowing1

జీరో వ్యాలీ

జీరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 5500 అడుగుల ఎత్తులో అద్భుత‌మైన, అందమైన ప్రదేశం. ఇక్క‌డి క‌నుచూపుమేర క‌నిపించే పచ్చని గడ్డి భూములు, పచ్చని వెదురు అడవులు, ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. జిరో వ్యాలీ దాని ప్రత్యేక వ్యవసాయం, గొప్ప వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వ్యవసాయం కోసం ఏ జంతువు లేదా యంత్రం సహాయం తీసుకోరు. ప్రజలు తమ చేతులతో అన్ని పనులను చేస్తారు. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేవారు త‌ప్ప‌కుండా ఇక్క‌డ ఉండే టాలీ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం, కార్డో హిల్స్ వద్ద ఉన్న శివలింగాన్ని మాత్రం అస్స‌లు మిస్స‌వ్వ‌కండి.

More News

    Read more about: arunachal pradesh tourism
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+