Search
  • Follow NativePlanet
Share
» »మొనోరైలు వింతలూ...విశేషాలు!!

మొనోరైలు వింతలూ...విశేషాలు!!

రైలు అంటే ఎక్కువ బోగీలు ఉంటాయి, చుక్...చుక్...చుక్... మని శబ్దం చేసుకుంటూ వస్తుంది, రెండు పట్టాలపై నడుస్తుంది అని ఎవ్వరైనా సాధారణంగా చెప్పేది ఇదే! అవునా?? కాని ఇక్కడ ఒక రైలు ఉందండి భలేగా ఉంటుంది. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందామా మరి!!
మోనో రైలు, ఇప్పుడు మనదేశంలో కూడా వినిపిస్తున్నమాట. ఈ మధ్యే ముంబై మహానగరంలో 8 కి.మీ. దూరం ప్రయాణీకులతో ప్రయాణించి న్యూస్ లో ఎక్కింది. త్వరలో గనక 19.4 కి.మీ. మోనో రైలు ట్రాక్ పూర్తి చేస్తే ప్రపంచంలో కెల్లా రెండవ అతి పొడవైన మోనో రైలు వ్యవస్థ మనదే అవుతుంది. ప్రస్తుతం జపాన్ ఒసకా మోనో రైలు 22 మైళ్ళ దూరంతో ప్రపంచలోనే పొడవైనదిగా ప్రసిద్దికెక్కింది.

మోనోరైలు కథ

మోనో రైలు మామూలు రైళ్ళ మాదిరి రెండు పట్టాల మీద నడవదు. దీనికంటూ ఒక ట్రాక్ నిర్మిస్తారు. ఈ ట్రాక్ మీదుగానే రైలు ప్రయాణిస్తుంది. ఒక దిమ్మెల ఉండే ఆ ట్రాక్ మధ్యలో ఒక చక్రం ఆధారంగా ఉండే దిమ్మెకు రెండు వైపులా రెండు చక్రాలు అడ్డంగా తిరుగుతుంటాయి. ఈ మోనో రైలు టైర్లు రబ్బరువి.

మనదేశంలో మోనో రైలు ఆనవాళ్ళు!!

స్వాతంత్య్రం రాక ముందు కూడా మోనో రైలు మనదేశంలో నడిచింది మీకు తెలుసా?కేరళలోని కుందాల వ్యాలీ రైల్వేను మొదటి మొనోరైలుగా చెబుతారు. అంతేగాక మున్నార్ హిల్ స్టేషన్ 1902 నుంచి 1924 వరకు నడిపారు. రైళ్ అంటే ఇంజన్ ఉందనుకునేరు..మధ్యలో ఒక పట్టాపై బోగీలు ఉంటే, ఆ బోగీలను ఎద్డులు లాగేవి. కొండ ప్రాంతాలలో నడిచే ఈ రైళ్లలో టీపొడి, ఇతర సామాగ్రిని సరఫరా చేస్తుండేవారు.
మనదేశంలో రెండో మోనో రైలు వ్యవస్థ పంజాబ్ లోని పాటియాలాలో 1907 నుంచి 1927 వరకు నడిచింది. ఈ రైలు ఇంజన్ తో నడిచేది. రైలు కింద ఒక పట్టాపై చక్రం ఉంటే, పక్కనే బ్యాలెన్సింగ్ కొరకు మరొక చక్రామ్ ఉంటుంది. పాటియాలాలో నడిచిన రైలు ఇంజన్ ఢిల్లీలోని రైలు మ్యూజియంలో చూడవచ్చు.

ప్లాట్ ఫారంమీదకు వచ్చిన మోనో రైలు

ప్లాట్ ఫారంమీదకు వచ్చిన మోనో రైలు

Photo Courtesy: MMRDA

మొనోరైలులోని స్విచ్ బోర్డులు

మొనోరైలులోని స్విచ్ బోర్డులు

Photo Courtesy: Ashwin Kumar

మొనోరైలు ఎక్కడానికి సిద్దంగా ఉన్న ప్రయాణీకులు

మొనోరైలు ఎక్కడానికి సిద్దంగా ఉన్న ప్రయాణీకులు

Photo Courtesy: Ashwin Kumar

మొనోరైలు పట్టాల వంపులు

మొనోరైలు పట్టాల వంపులు

Photo Courtesy: Ashwin Kumar

ప్లాట్‌ఫారం మీదకు దూసుకువస్తున్న మొనోరైలు

ప్లాట్‌ఫారం మీదకు దూసుకువస్తున్న మొనోరైలు

Photo Courtesy: Ashwin Kumar

వంపులు తిరుగుతున్న మొనోరైలు

వంపులు తిరుగుతున్న మొనోరైలు

Photo Courtesy: Ashwin Kumar

మొనోరైలు ముఖచిత్రం

మొనోరైలు ముఖచిత్రం

Photo Courtesy: Sudhir Dehwal

ఢిల్లీ రైలు మ్యూజియంలోని పాటియాలా రైలు

ఢిల్లీ రైలు మ్యూజియంలోని పాటియాలా రైలు

Photo Courtesy: Pravin Jha

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+