Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య శ్రావణ జూలా మేళాకు వెళ్తున్నారా? దర్శనం, ట్రాఫిక్ రూల్స్, కొత్త పాస్ నిబంధనల పూర్తి గైడ్ ఇదే!

అయోధ్య శ్రావణ జూలా మేళాకు వెళ్తున్నారా? దర్శనం, ట్రాఫిక్ రూల్స్, కొత్త పాస్ నిబంధనల పూర్తి గైడ్ ఇదే!

అయోధ్యలో ప్రసిద్ధ శ్రావణ జూలా మేళా వైభవంగా సాగుతోంది. ఈ ఉత్సవాలు ఆగస్టు 28 వరకు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 23తో పాటు రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 27, 28 తేదీల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ భక్తులకు దర్శనం సులభతరం చేసేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు కొత్త రద్దీ నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నారు. కాబట్టి అయోధ్య ప్రయాణమయ్యే భక్తులు, సందర్శకులు కొత్త పాస్ నిబంధనలు, ట్రాఫిక్ రూట్లను ముందుగానే తెలుసుకోవడం మంచిది.

ఆలయం లోపలి భాగానికి వెళ్లాలంటే అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా 'సుగమ్ దర్శన్' పాస్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును భక్తులు తమ వెంట కచ్చితంగా తెచ్చుకోవాలి. పండుగ రోజుల్లో గర్భగుడి వద్ద రద్దీని నివారించేందుకు రోజువారీ దర్శన స్లాట్ల సంఖ్యపై పరిమితి విధించారు. ఇక వృద్ధులకు ఇబ్బంది కలగకుండా ప్రధాన ద్వారం వద్ద వీల్‌చైర్లు, ప్రత్యేక క్యూలైన్ల సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Ayodhya Shravan Jhula Mela 2026: Essential Guide for Darshan Passes, Traffic Rules, and Crowd Control

అయోధ్య శ్రావణ జూలా మేళా: ట్రాఫిక్ మళ్లింపులు, ప్రయాణికులకు సలహాలు

భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పోలీసులు రూట్ డైవర్షన్లు విధించారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆలయ ప్రధాన ప్రాంతానికి వెలుపల ఉన్న పార్కింగ్ జోన్ల వైపే మళ్లిస్తున్నారు. ఇక రైలు మార్గంలో 'అయోధ్య ధామ్' స్టేషన్‌కు చేరుకునే భక్తులు, తమ ప్రయాణ సమయానికి మరో 45 నిమిషాల సమయాన్ని అదనంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అధికారులు కేటాయించిన డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఉపయోగించడం వల్ల కాలినడక మార్గాల్లో రద్దీ పెరగకుండా ఉంటుంది.

సమయం వృథా కాకుండా, బారికేడ్ల మధ్య గంటల తరబడి నిలబడకుండా ఉండాలంటే అనువైన దర్శన స్లాట్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య సమయం దర్శనానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య కూడా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన సమయం తక్కువగానే ఉంటుంది. అయితే, సాయంత్రం వేళల్లో లేదా మంగళవారాల్లో వస్తే మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి దర్శనానికి చాలా సమయం పడుతుంది.

సమయం అంచనా రద్దీ ప్రయాణ సూచన
ఉదయం 5:30 – 8:30 తక్కువ నుంచి మోస్తరు వృద్ధులు, కుటుంబాలకు అనుకూలం
మధ్యాహ్నం 12:00 – 3:00 మోస్తరు రద్దీ క్యూలైన్లలో వేచి ఉండే సమయం తక్కువ
సాయంత్రం 4:00 – రాత్రి 9:00 భారీ రద్దీ బారికేడ్లలో ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తుంది

కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రధాన మార్గాల్లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంచారు. ఉచిత క్లోక్‌రూమ్‌లు, చెప్పుల కౌంటర్లు ఏర్పాటు చేశారు. వస్తువులను అక్కడ సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. వర్షం పడితే భక్తులు తడవకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లను సిద్ధం చేశారు. భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాలను 'నో డ్రోన్ జోన్'గా ప్రకటించడంతో పాటు సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా ఉంచారు. అధికారులు సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ బాలరాముడి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోండి.

More News

Read more about: ayodhya travel guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+