బెంగళూరు-మంగళూరు వందే భారత్ రైలు రెండో విడత పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. సెప్టెంబర్ 10-11 తేదీల్లో సకలేశ్‌పూర్-సుబ్రహ్మణ్య ఘాట్ సెక్షన్ మధ్య నిర్వహించిన ఈ ట్రయల్ రన్ నిర్ణీత సమయం కంటే ముందే పూర్తయింది. వివిధ విభాగాల రైల్వే బృందాలు రైలు వేగం, బ్రేకింగ్ సిస్టమ్, నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించాయి. శుక్రవారం మధ్యాహ్నం 3:10 గంటలకు మంగళూరు జంక్షన్ నుంచి ఈ రైలు తిరుగు ప్రయాణమైంది. ఈ రన్‌లో భాగంగా కబక పుత్తూరు వద్ద రైలును కాసేపు ఆపినప్పటికీ, అది ఖరారైన స్టాప్ కాదని అధికారులు తెలిపారు. వాణిజ్యపరమైన సేవలు ప్రారంభమయ్యే ముందు సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రకటన, భద్రతా అనుమతుల కోసం వేచి చూడాల్సి ఉంది.
తొలి ఫలితాలను బట్టి చూస్తే బెంగళూరు-మంగళూరు మధ్య ప్రయాణ సమయం 8 గంటల కంటే తక్కువకు తగ్గనుంది. రెండవ ట్రయల్ రన్ షెడ్యూల్ కంటే దాదాపు 55 నిమిషాల ముందే ముగియడంతో, మొత్తం ప్రయాణం సుమారు 7 గంటల్లోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యశ్వంత్‌పూర్-మంగళూరు మధ్య నడుస్తున్న వేగవంతమైన రైళ్లకు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అయితే, అదే రోజు తిరుగు ప్రయాణం సాధ్యపడాలంటే లేట్ ఈవినింగ్ టైమింగ్స్ కేటాయించాల్సి ఉంటుంది. అధికారులు ఇంకా అధికారిక సమయాలను ప్రకటించలేదు కాబట్టి వేచి చూడక తప్పదు.

బెంగళూరు-మంగళూరు వందే భారత్ రూట్, ట్రయల్ రన్ విశేషాలు
ట్రయల్ రన్ నిర్వహించిన ఈ రైలు యశ్వంత్‌పూర్-హాసన్-సకలేశ్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్-మంగళూరు జంక్షన్ మార్గంలో నడుస్తుంది. కర్ణాటకలోనే అత్యంత క్లిష్టమైన ఘాట్ సెక్షన్ ఇది. మూలమలుపులు, టన్నెల్స్, 1:50 నిష్పత్తిలో నిటారుగా ఉండే ఘాట్ మార్గంలో బ్రేకింగ్ సిస్టమ్, రైలు నియంత్రణను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ ఘాట్ మార్గం కోసం ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్ కలిగిన రేక్‌ను అధికారులు గతంలోనే పరీక్షించి అనుమతించారు. ఇక కబక పుత్తూరు వద్ద రైలును ఆపడం కేవలం ట్రయల్స్‌లో భాగమే. తుది షెడ్యూల్ విడుదలయ్యే ముందు మరో ట్రయల్ రన్ లేదా అధికారిక అనుమతులు లభించే అవకాశం ఉంది.
బెంగళూరు-మంగళూరు వందే భారత్ బుకింగ్స్, ప్రయాణ ప్లాన్
టికెట్లు అందుబాటులోకి రాగానే తెలుసుకునేందుకు IRCTC యాప్‌లో అలర్ట్స్ ఆన్ చేసుకోండి. అలాగే టైమింగ్స్‌కు సంబంధించిన వివరాల కోసం సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ఛానెళ్లను ఫాలో అవ్వండి. మొదట్లోనే విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి, ప్రత్యామ్నాయ రైళ్లు, ప్రయాణ తేదీలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఎక్కడానికి వీలుగా ఉండేందుకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌నే బోర్డింగ్ పాయింట్‌గా ఎంచుకోండి. సకలేశ్‌పూర్ దాటిన తర్వాత కిటికీలోంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు కళ్లకడతాయి. హైదరాబాద్, విజయవాడ లేదా విశాఖపట్నం నుంచి విమానాలు లేదా నైట్ ప్రయాణాలు చేసి వచ్చేవారు, ఉదయాన్నే బెంగళూరు చేరుకుంటే ఈ వందే భారత్ ప్రయాణానికి అనువుగా ఉంటుంది.
వందే భారత్ కనెక్టివిటీతో కోస్టల్ టూర్ ప్లాన్స్
మధ్యాహ్నం వేళకే మంగళూరు చేరుకుంటే, అక్కడి నుంచి ఉడుపి, సూరత్‌కల్ ప్రాంతాలను అదే రోజు సందర్శించవచ్చు. మంగళూరు జంక్షన్ నుంచి ఉడుపికి ప్రతిరోజూ అనేక MEMU, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ఇవి దాదాపు 75 నుంచి 90 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుస్తాయి. సూరత్‌కల్ రైల్వే స్టేషన్ సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండటంతో ఆటోలో త్వరగా బీచ్‌కి వెళ్లవచ్చు. ప్రయాణ ప్లాన్, హోటల్ చెకిన్ లాంటివి ఖరారు చేసుకునే ముందు రైలు నిలిచే చివరి స్టాప్‌లు, వేళలను ఒకసారి సరిచూసుకోండి.



Click it and Unblock the Notifications