Search
  • Follow NativePlanet
Share
» »కొచ్చి ఆహారాలు - ఉత్తమ హోటళ్ళు!

కొచ్చి ఆహారాలు - ఉత్తమ హోటళ్ళు!

కేరళ రాష్ట్రం లోని కోచి పట్టణం ఎల్లపుడూ ఎంతో బిజి గా వుంటుంది. ఈ పట్టణంలో స్థానికులైన కేరళ వాసులే కాక, ప్రపంచ వివిధ భాగాల నుండి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు, వృత్తి నిపుణులు కూడా నివసిస్తారు. వివిధ ప్రదేశాల వారు వుంటారు కనుక, మరి వివిధ సంస్కృతులు కూడా ఇక్కడ వుంటాయి. వారి తెగల వలెనె వారి ఆహార సంస్కృతి కూడా రక రకాలుగా వుంటుంది. కోచి లో అసలైన వారి వారి సంస్కృతుల రుచికర ఆహారాలు అందించేందుకు వివిధ హోటళ్ళు కలవు. ఈ హోటళ్ళలో ఉత్తమమైనవి పరిశీలిద్దాం.
కోచిలో బెస్ట్ హోటళ్ళు

దాల్ రోటి

ఉత్తర భారత దేశపు ఆహారాలు అయిన అసలైన దాల్ రోటి తినాలంటే, ఫోర్ట్ కోచి కి వెళ్ళాలి. ఇక్కడ మీకు దాల్ తడ్కా, పుల్కాలు నుండి వేడి వేడి తందూరి కబాబ్ ల వరకూ మరియు రైతా లు దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ ఫోర్ట్ కోచి లోని చర్చి రోడ్ లో కలదు. పని వేళలు ఉ.9 గం.నుండి రా. 10 గం. వరకు.

ఫ్రై విలేజ్ రెస్టారెంట్

కోచి లోని వీక్షణం రోడ్ లో కల ఫ్రై విలేజ్ రెస్టారెంట్ లో మీకు అసలైన కేరళ ఫుడ్ , ప్రత్యేకించి సి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ రుచికర వంటకాలను అరటి ఆకులలో అందించటం ఒక ప్రత్యేకత. ఇక్కడ మీకు అన్ని కేరళ ఫుడ్ లు అంటే ‘ఇదియప్పం', ‘ మీన్ పోల్లిచాతు', ‘నాదాన్ బీఫ్ ఫ్రై ‘ మొదలైనవి సరసమైన ధరలలో దొరుకుతాయి.

టీ పోట్

చిన్నదైన ఈ హోటల్ అక్కడ దొరికే టీ, స్నాక్స్, కు ప్రసిద్ధి. హోటల్ వాతావరణం బాగుంటుంది. టీ చెట్టు ఆకారంలో టేబుల్స్ వుండి టీ పోట్ లు వేలాడుతూ వుంటాయి. టీ తో తాజా అనుభూతి పొందాలంటే, ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ టీ మాత్రమే కాక, మిల్క్ షేకులు కేకులు, ఇతర తాజా ఆహారాలు కూడా సమంజస ధరలలో లభిస్తాయి. కోచి లో మంచి హోటల్ అయిన టీ పోట్ ఫోర్ట్ కోచి లో పీటర్ సెల్లి లో కలదు.

టాక్ అఫ్ ది టవున్

ఈ హోటల్ ఫోర్ట్ కోచి లో మంచి చవక రెస్టారెంట్. ఇది శాంతా క్రజ్ బాసిలికా కు సమీపంలో కలదు. ఈ రెస్టరెంట్ లో ఇండియాలోని అన్ని ప్రదేశాల వంటకాలు లభిస్తాయి. రుచికర వంటకాలు మాత్రమే కాక, ఇక్కడి సిబ్బంది ఎంతో స్నేహ పూరితంగా కూడా వుంటారు. రెస్ట రెంట్ కు వెళ్ళినందుకు మీరు తప్పక ఆనందించ గలరు. ఇక్కడ మీరు ఫ్రూట్ లస్సి, బటర్ చికెన్, పైన్ ఆపిల్ టమాటో కర్రీ, కేరళ ఫిష్ కర్రీ మొదలైనవి తిని ఆనందించవచ్చు.

కొచ్చి లో బెస్ట్ హోటల్స్ !

కాసా ఇండియా

కాసా ఇండియా కోచిలో బెస్ట్ హోటల్. ఇక్కడ మీకు రుచికరమైన సాంప్రదాయ ఇండియన్ మరియు కాంటినెంటల్ ఆహారాలు లభిస్తాయి. ఈ హోటల్ ఫోర్ట్ కోచి లో పౌల్ స్కూల్ స్ట్రీట్ ఎదురుగా కలదు. ఇక్కడ వివిధ రుచుల ఆహారాలు సరసమైన ధరలలో మీరు ఎంపిక చేసికొనవచ్చు. ఈ హోటల్ లో మీకు కోకోనట్ ప్రాన్ కర్రీ తప్పక సిఫారసు చేయవచ్చు. ఇక్కడ మీకు నార్త్ ఇండియన్ ఫుడ్ మరియు కేరళ డిషెస్ కూడా లభిస్తాయి.

కోచి లోని ఆహారాలు, హోటళ్ళ గురించి చెప్పాలంటే, ఇంకా ఎన్నో కలవు. అతి త్వరలో మీ ముందుకు మరి కొన్ని రుచికర ఆహారాలు అందించే కోచి హోటళ్ళను మీ ముందు ఉంచబోతున్నాం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+