Search
  • Follow NativePlanet
Share
» »గోవా బీచ్‌లకే కాదు, పందిమాంసం కూరలకూ ఫేమస్

గోవా బీచ్‌లకే కాదు, పందిమాంసం కూరలకూ ఫేమస్

గోవాలో ఉత్తమ ఆహార పదార్థాలకు సంబంధించిన కథనం.

గోవా అన్న తక్షణం మనకు బీచ్ లే గుర్తుకు వస్తాయి. ఇక గోవా గురించి కొంతవరకు తెలిసిన వారికి అక్కడి నైట్ బజార్ షాపింగ్ గుర్తుకు వస్తుంది. మరికొంత ఆలోచిస్తే అక్కడ ఉన్న వాటర్ గేమ్స్ మీ ఊహలకు అందుతుంది. అదేవిధంగా గోవాకు సంబంధించి ప్రాచూర్యం చెందిన వంటకాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాచూర్యం పొందిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

గోవా ఫిష్ కర్రీ

గోవా ఫిష్ కర్రీ

P.C: You Tube

గోవాలో ఫిష్ కర్రీ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహారపదార్థం. సీ ఫుడ్ ను ఇష్టపడేవారేకి గోవాఫిష్ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. గోవాలో చాలా హోటల్స్ లో ఈ గోవా ఫిష్ కర్రీ దొరుకుతుంది.

గోవా ప్రాన్ కర్రీ

గోవా ప్రాన్ కర్రీ

P.C: You Tube

సముద్ర రొయ్యల రుచే వేరు. ఇక గోవాలో దొరికే రొయ్యలతో చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది. అందుకే గోవాకు వెళ్లిన వారిలో చాలా మంది రొయ్యల కూరను తినకుండా వెనుదిరగరు. కొంతమంది గోవాకు వెళ్లిన తక్షణం రొయ్యలతో చేసిన ఆహారాన్నే తింటారు.

ఫిష్ రెబెడో

ఫిష్ రెబెడో

P.C: You Tube

రెబెడో అంటే ఫ్రెంచ్ భాషలో స్టఫ్డ్ అని అర్థం. సముద్ర చేపల పొట్టలోపల ఉల్లిపాయలతో పాటు మరికొన్ని మసాలా దినుసులను చేర్చి ఈ ఫిష్ రెబెడోను చేస్తారు. ఈ ఫిష్ రెబడో అటు స్నాక్స్ గా కూడా చాలా మంది తింటారు. గోవా ప్రత్యేక వంటకాల్లో దీనిది మొదటి స్థానం.

బింబిక

బింబిక

P.C: You Tube

గోవా ప్రత్యేక తీపి వంటకం బింబిక. దీనిని లేత కొబ్బరి ముక్కల నుంచి తీసిన పాలు, కోడిగుడ్డు, వెన్నతోపాటు కొంత చెక్కెర లేదా బెళ్లం కలిపి తయారు చేస్తారు. ఈ బింబిక కేక్ మాదిరిగా ఉంటుంది. గోవాలోని ప్రతి రెస్టోరెంట్, బేకరీలో ఈ బింబిక తప్పక దొరుకుతుంది.

పోర్క్

పోర్క్

P.C: You Tube

గోవా పోర్క్ (పంది మాంసం)తో చేసిన కూరలకు చాలా ప్రసిద్ధి చెందినది. పోర్క్ కర్రీ, ఫ్రై, బీబీక్యూ పోర్క్ తదితర వంటకాలు గోవాలో దొరుకుతాయి. ముఖ్యంగా గోవా చుట్టు పక్కల ప్రాంతాల్లో మాత్రమే దొరికే మసాలా దినుసులతో తయారు చేసిన పోర్క్ రుచి చూడందే విదేశీయులు గోవా నుంచి వెనుదిరగరు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+