Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్!

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్!

హైదరాబాద్ నవాబుల నగరం. భారతదేశంలో గల ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నగరంలో పార్క్ లు, ఉద్యానవనాలు ఎన్నో వున్నాయి.

By Venkata Karunasri Nalluru

మీ యొక్క విలువైన సమయాన్ని మీ ప్రియమైన వారితో కలిసి విశ్రాంతిగా హాయిగా గడుపుటకు హైదరాబాద్ నగరంలోని ఉత్తమ ఉద్యానవనాలు మరియు తోటలకు వెళ్దామా! మరెందుకాలస్యం అయితే పదండి !

లుంబినీ పార్క్ :

హైదరాబాద్ నగరంలోని పార్కులలో "లుంబినీ పార్క్" ఒకటి. హుస్సేన్ సాగర్ లేక్ పక్కనే ఉన్న లుంబినీ పార్క్ ను తరచుగా పర్యాటకులు మరియు ప్రయాణికులు సందర్శిస్తారు. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉండటం వలన లుంబినీ పార్క్ కూడా బిర్లా మందిర్ వంటి పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా వుంది.

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్

Photo Courtesy: TripodStories- AB

ఇక్కడ లేజర్ ఆడిటోరియం కూడా వుంది. పార్క్ లో ఇంకా జలపాతాలు, మల్టీమీడియా షో, బుద్ధ విగ్రహం మరియు అడ్వెంచర్ రైడ్స్ కూడా ఉన్నాయి.

చిరునామా: ఖైరతాబాద్ లో గల సెక్రటేరియట్ న్యూ గేట్ కి ఆపోజిట్ లో వుంది.

టైమింగ్స్: ఉదయం 9 గం. నుండి రాత్రి 9 గం. ల వరకు పార్క్ తెరచి వుంటుంది.

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్

ఇందిరా పార్క్ :

ఇందిరా పార్క్ హైదరాబాద్ లోని పురాతన పార్కులలో ఒకటి. నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఇందిరా పార్క్ ఒకటి. ఈ పార్క్ 76 ఎకరాలు విస్తరించి ఉంది. ఇందిరా పార్క్ లోపల రాక్ తోట ఉంది. ఇది పర్యాటకులను చాలా బాగా ఆకర్షిస్తుంది.

ఇందిరా పార్క్ లో మీరు తప్పక చూడవల్సినవి: కంప్యూటరైజ్డ్ మ్యూజికల్ డాన్సింగ్, వాణిజ్య నర్సరీ, మానవ నిర్మిత సరస్సు, బోటింగ్ సౌకర్యాలు మరియు జలపాతాలు.

చిరునామా: దోమలగూడ, లోవర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ

టైమింగ్స్: ఉదయం 5 గం. నుండి రాత్రి 7:30 గం. ల వరకు చూడవచ్చును

హైదరాబాద్ లో గల ఉత్తమ పార్కులు మరియు గార్డెన్స్

Photo Courtesy: Mhdmzml

సంజీవయ్య పార్క్ :

సంజీవయ్య పార్కు హైదరాబాద్ నగరంలో గల ఒక పబ్లిక్ గ్రీన్-స్పేస్. ఇక్కడ చూడదగిన కొన్ని అంశాలు : హుస్సేన్ సాగర్ లేక్, లష్ గ్రీనరీ, రాక్ తోట మరియు ఫన్ కార్యకలాపాలు. ఈ పార్క్ ను లవర్స్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ నగరం నుండి దూరంగా లవర్స్ ఏకాంతంగా గడుపుతారు. స్కేటింగ్ రేసెస్ ఈ పార్క్ లో ప్రసిద్ధి చెందినది. సామాజిక స్పృహ కలిగించే ప్రచారాలు మరియు ఇతర కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఈ పార్క్ ను తాజాగా మరియు యాక్టివ్ గా ఉంచుతుంది.

ఈ విధంగా మీరు హైదరాబాద్ లో సందర్శించటానికి పర్యాటక ఆకర్షణలు చాలా వున్నాయి. ఈ స్థలాలే కాకుండా ఇక్కడ రుచికరమైన కారంగా వుండే వంటలను కూడా రుచి చూడవచ్చును.

హైదరాబాద్ లోని హోటల్స్

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+