Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఉత్తమ స్థలాలు !

హైదరాబాద్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఉత్తమ స్థలాలు !

హైదరాబాద్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఉత్తమ ప్రదేశాల వివరాలు

By Venkata Karunasri Nalluru

హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో గల అతి పెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, నోరూరించే హైదరాబాదీ బిర్యానీ మొదలైన ప్రసిద్ధి అంశాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. భారతదేశంలో గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వం మరియు మానవ నిర్మిత అద్భుతాలు కలిగిన ప్రదేశాలలో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ హైదరాబాద్ లో తప్పక చూడవలసిన స్థలాలను కొన్నింటిని గూర్చి తెలుసుకొందాం.

రుచికరమైన స్ట్రీట్ ఫుడ్

PC: Madhavan Muthukaruppan

రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ కోసం హైదరాబాద్ లో ప్రసిద్ధ ప్రదేశాలు కొన్ని వున్నాయి.

పాతార్ గట్టి :

పాతార్ గట్టి రుచికరమైన రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అందించే ప్రసిద్ధి ప్రాంతాలలో ఒకటి. మదీనా సర్కిల్ లోని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తుంది. ఇంకా రుచికరమైన సేవలందించే కొన్ని స్ట్రీట్ ఫుడ్ అవుట్లెట్లు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. టీ మరియు బిస్కెట్లు వీధుల చుట్టూ తిరిగి అమ్మేవాళ్ళు ఇక్కడ సాధారణంగా కనిపిస్తారు.

ప్రగతి గల్లీ :

ప్రగతి గల్లీ హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో గల వీధి. ఈ ప్రదేశం రుచికరమైన అల్పాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది.

ఉదయాన్నే వీధులలో తాజాగా తయారుచేసే ఇడ్లీలు, దోసెలు, ఉప్మా, మేడు వడ మొదలైన వాటి ఘుమఘుమలతో ఇక్కడి వారు మేల్కొంటారు.

గచ్చిబౌలి :

గచ్చిబౌలి హైదరాబాద్ ఐటి కేంద్రాలలో ఒకటి. ఈ ప్రాంతం కూడా రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ కు ప్రసిద్ధి చెందింది. పంజాబీ అద్భుతమైన రుచికరమైన చాట్లు మరియు స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ లభిస్తుంది. హైదరాబాద్ లో చూడవల్సిన ప్రసిద్ధ అవుట్లెట్లలో సర్దార్ కి ఛాట్ ఒకటి.

రుచికరమైన స్ట్రీట్ ఫుడ్

PC: Madhavan Muthukaruppan

సింధీ కాలనీ :

సింధీ కాలనీ ప్రపంచవ్యాప్తంగా ఏకైక రుచిని అందిస్తుంది. భారతీయ మసాల యొక్క టచ్ తో మొదలై చైనీస్, మెక్సికన్, ఇటాలియన్, పంజాబీ, వంటి రుచికరమైన వంటకాలను వెరైటీ రుచులతో ఇక్కడ అందిస్తారు.

గ్యాన్ బాగ్ కాలనీ :

హైదరాబాద్ లో గ్యాన్ బాగ్ కాలనీలో హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధిచెందిన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. లక్ష్మణ్ కి బండి గొప్ప ఆహారం అందించే అవుట్లెట్లలో ఒకటి. మెల్టింగ్ బట్టర్ ఇడ్లీలు ఇక్కడ ప్రసిద్ధి.

కోటి :

కోటి భోజనప్రియులకు ప్రసిద్ధిచెందిన మరొక ప్రదేశం. ఇక్కడ మొజంజాహీ మార్కెట్ లో రుచికరమైన ఛాట్ మరియు స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. గోకుల్ ఛాట్ ఎప్పుడూ బిజీగా వుండే ప్రాంతం. ఇది ఉత్తమ అవుట్లెట్లలో ఒకటి.

మాధాపూర్ :

మాదాపూర్ లో మీ స్నేహితులు మరియు కుటుంబంతో కలిసి తినగల రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది.

నిజాముల రుచికరమైన నగరం అన్వేషించడానికి హైదరాబాద్ కు ప్రయాణించి అక్కడ అందుబాటులో వుండే ఉత్తమ స్ట్రీట్ ఫుడ్ తిని ఆనందించండి !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+