Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో ఉన్నారా ? అయితే ఇక్కడ చాట్ తినండి !

బెంగళూరు లో ఉన్నారా ? అయితే ఇక్కడ చాట్ తినండి !

By Mohammad

కారంకారంగా, పుల్లపుల్లగా, మధ్యమధ్యలో తియ్యతియ్యగా నాలుకకి భిన్న రుచులను అందించే సాయంకాలం ఫ్రెండే 'చాట్'. కరకరమని, నోట్లో వేసుకాగానే ఇట్టే నలిగిపోయి .. భలేభలేగా ఉంటుంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసును దోచేసే రుచికరమైన, ఇష్టంగా తినే ఆ తిండి గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది.

మీరు బెంగళూరు లో ఉండి సాయంత్రం వేళ బయటికి వెళితే తప్పక ఈ ప్రదేశాల్లో చాట్ తినండి. ఇప్పుడు అప్పడు అని కాకుండా సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా చాట్ దొరుకుతుంది. మరి ఇవి ఎక్కడ తింటే టెస్ట్ గా ఉంటాయి ? ఎలా వెళ్ళాలి అనేగా మీ సందేశం ?! అక్కడికే వస్తున్నాను, ఇక ఆలస్యం చేయకుండా బండి వేసుకొని బయలుదేరండి!

ధై పూరి

ధై పూరి

చిత్ర కృప : Senorhorst Jahnsen

1. కర్ణాటక భేల్ హౌస్ - బసవనగుడి

కర్నాటక భేల్ హౌస్, చాట్ కి పాపులర్. బెంగళూరు లో దీనికి వివిధ ప్రదేశాల్లో బ్రాంచీలు కూడా ఉన్నాయి. అయితే, బసవనగుడి లో ఉన్న బ్రాంచీ సాయంత్రం అయ్యిందంటే ఆహార ప్రియులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ వారిని మర్యాదగా పలకరిస్తూ .. చాట్ ను అందిస్తుంటారు. పార్సెల్ సౌకర్యం కూడా ఉన్నది. చాలా మంది భేల్ పూరి ని ఆర్డర్ చేస్తుంటారు. ధై పూరి కూడా రుచిగానే ఉంటుంది.

చిరునామా : 6, 2nd లైన్, 3 rd క్రాస్, చామ్రాజ్పేట్, బసవనగుడి

తెరిచి ఉంచు సమయం : సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు

2. ఖాన్ సాహెబ్ గ్రిల్స్ అండ్ రోల్స్, ఇంద్రానగర్

మీరు కబాబ్ ప్రియులా ? అయితే ఇంద్రా నగర్ లోని ఖాన్ సాహెబ్ గ్రిల్స్ అండ్ రోల్స్ వద్దకు వెళ్ళండి. అక్కడ రోల్స్ మరియు గ్రిల్ చికెన్ వంటి నోరూరించే నాన్ - వెజ్ ఆహారాలు మీకు స్వాగతం పలుకుతాయి. ఒకవేళ మీరు రాకపోయినా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఆర్డర్ త్వరగానే వేడివేడిగా మీ ముంగిట వస్తుంది.

చిరునామా : గ్రౌండ్ ఫ్లోర్, శ్రీ శివసాయి కాంప్లెక్స్, 13th క్రాస్, 7th మెయిన్, 2nd స్టేజి, హెచ్ ఎ ఎల్, ఆఫ్ డబల్ రోడ్, ఇంద్రానగర్


తెరిచి ఉంచు సమయం :
ఆదివారం - గురువారం మధ్యాహ్నం 12 : 30 నుండి రాత్రి 11:30 వరకు మరియు శుక్ర వారం - శనివారం మధ్యాహ్నం 12:30 నుండి అర్ధరాత్రి 12: 30 వరకు

నోరూరించే కబాబ్

నోరూరించే కబాబ్

చిత్ర కృప : Harsha K R

3. డయల్ ఎ చాట్ - ఔటర్ రింగ్ రోడ్, వైట్ ఫీల్డ్

ఈ చాట్ కూడా హోం డెలివరి సదుపాయాన్ని అందిస్తున్నది. వర్షం కురుస్తున్న సమయంలో వేడివేడిగా, కారం కారంగా ఏదైనా చాట్ తినాలనిపిస్తే ఆన్లైన్ లో వెళ్లి చాట్ ఆర్డర్ ఇవ్వండి. ఇక్కడ రాజ్ కచోరి స్నాక్ మిస్ కావద్దు .!

చిరునామా : 14, 1st ఫ్లోర్, వినాయక లేఔట్, దోద్దనేకుంది, ఆల్పైన్ ఎకో అపార్ట్ మెంట్ దగ్గరలో, ఔటర్ రిండ్ రోడ్, వైట్ ఫీల్డ్

తెరిచి ఉంచు సమయం : 12 pm - 3 pm, 5:45 pm - 10:30 pm

4. కార్తీక్ మిఠాయి షాప్, ఇంద్రానగర్

ఇంద్రానగర్ లో బెస్ట్ చాట్ సెంటర్ ఇది. ఇక్కడ మీరు వివిధ రకాల రుచులను ఆస్వాదించవచ్చు. నోరూరించే స్వీట్ లకు, తంగి చాట్ లకు ఈ చాట్ సెంటర్ వాహ్వా ... అనిపిస్తుంది. చోలే బట్టర్ డిష్ తప్పక రుచి చూడండి.

చిరునామా : 322, శాలిని కాంప్లెక్స్, CMH రోడ్, ఇంద్రానగర్

తెరిచి ఉంచు సమయం : 10 am - 10 : 30 pm

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+