ఇప్పటికి ఎన్నో హనీమూన్ ప్రదేశాలు, రొమాంటిక్ రిసార్ట్ లు చదివే వుంటారు. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా వుండదు. ఒక్కొక్కపుడు అనుకొని అవాంతరాలు వస్తాయి. అపుడపుడూ వివాహ సంబంధాలు కూడా విచ్చిన్నం అవుతూనే వుంటాయి. ఈ బాధను భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు. ఒంటరి వారు అయి ఎంతో విలపిస్తారు. అయితే, విలపిస్తూ కూర్చునే కంటే, మరో మారు జీవితం ఆనందించాలి. అందుకు గాను మొదటి మెట్టుగా, మీరు మీ పార్టనర్ కలసి తిరిగిన ప్రదేశాలకు దూరంగా వుండండి. అంతేకాదు, మీకు ఊరట కలిగే, కొన్ని మంచి ప్రదేశాలను చూడటం కూడా అవసరం. మరి వివాహం విచ్చిన్నం అయితే, ఆ సంఘటన నుండి కోలుకోవడాని గాను ఏ ప్రదేశాలు పర్యటించాలి ? ఏమేమి చేయాలి అనేది పరిశీలించండి.
మీరు వెళ్ళే ప్రదేశం మిమ్ములను పూర్తిగా మైమరపించేదిగా ఉండాలి ? మీరు కష్టంలో వున్నపుడు మీరు సంచరించే ప్రదేశం మీ మనస్సును అధిగామించేడిగా వుండాలి. మీరు మరల ఒకమామూలు మనిషి అయ్యేలా వుండాలి. మేము సూచేంచే ఈ ప్రదేశాలు తప్పక మిమ్ములను ఊరడించి సమాధాన పర చేవిగా వుంటాయి. ఆ ప్రదేశాలు ఏమిటో పరిశీలించండి. పర్యటనకు మీ బాగ్ అండ్ బాగేజ్ తో సిద్ధం అయిపోండి.

హావ్ లాక్ ఐలాండ్
అండమాన్ దీవులలో కల హావ్ లాక్ ద్వీపం ప్రదేశం మీకు అంతులేని తన అందాలతో మిమ్ములను పర్యాటక పరంగా ఆలోచింప చేస్తుంది.ప్రకృతి అందాలకు పరవసిస్తారు మీరు వున్న పరిస్థికి దీని పర్యటన ఒక ఎస్కేప్ గా ఏ మాత్రం భావించరు. ప్రపంచ అందాలను చూసేందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనేటందుకు ఒక గొప్ప అవహాశం గా మీరు భావిస్తారు. మంత్ర ముగ్ధులను చేసే ఈ ద్వీపం పర్యటన మీరు మీ ట్రావెల్ లిస్టు లో పై భాగాన ఉంచాలి.

స్పా లలో చికిత్స
మీ మనస్సు రంజింప బడాలంటే, అనాధుల కొరకు విరాళాలు సేకరించవలసిన అవసరం లేదు. ముందు మీ శరీరానికి మీరు కొంత సేవ చేసుకోండి. కేరళలో కల ఆయుర్వేద స్పా రిసార్ట్ లను దర్శించండి. అవి మిమ్మల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉంచుతాయి. గజి బిజీ అనిపించే ఇతర ప్రపంచం నుండి వేరు చేస్తాయి. ప్రశాంతమైన ఈ ప్రదేశాలలో రిలాక్స్ అయి తక్షణ విశ్రాంతి పొందండి. మీకు తప్పక ఊరట కలుగుతుంది.

పర్వతారోహణ ఆనందాలు
పర్వతా రోహణ ఆనందాలు అనుభవించేందుకు మనాలి - లెహ్ ప్రదేశాలు వెళ్ళండి. ఈ ప్రదేశాలలో బైకింగ్ చేయవచ్చు. బైకింగ్ మీ మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అక్కడ కల కొంతమంది బైకర్ ఫ్రెండ్స్ తో మీ కష్టం సుఖం పంచుకోనండి. ఇండియా లో టాప్ రోడ్ పర్యటనగా చెప్పబడుతున్న మనాలి - లెహ్ బైక్ పర్యటన మిమ్మల్ని మీరు మరచిపోయేలా చేస్తుంది. అక్కడి వారితో కలసిపోతే, మీరు సింగల్ కాదన్న భావన పోతుంది.

జన సంచారం లేని బీచ్ తీరం
జన సంచారం లేని ఒక అందమైన బీచ్ కు వెళ్ళండి. వెస్ట్ బెంగాల్ లోని శంకరపూర్ లో కల దిఘా బీచ్ అనుకూలం. మారు మూల ప్రాంతంలో ఎవరూ చేరనిది గా వుంటుంది. ఈ బీచ్ కొలకొత్త కు 185 కి. మీ. ల దూరంలో వుంటుంది. దిఘా కు తూర్పుగా 14 కి. మీ. ల దూరంలో దిఘా - కంటే రోడ్ పై వుంటుంది. బీచ్ తీరం వెంట కల సరివి చెట్లు, యూక లిప్తాస్ చెట్ల వెంట నడవండి. అక్కడ కల అద్భుత సూర్యాస్తమయ దృశ్యాలు చూడండి. ఈ బీచ్ తీర దృశ్యాలు, మీలో మరో మారు ఆత్మ విశ్వాసం కలిగించి ఆనందింప చేస్తాయి.
Photo Courtesy: anirbanbiswas

హంపి శిధిలాల మధ్య నడక
మీ ఈ జీవిత సమయంలో మీరు హంపి శిధిలాల మధ్య నడక సాగిస్తే, అది మరువ లేని అనుభూతులను అందిస్తుంది. ప్రకృతి పరంగానే కాక, సంస్కృతి పరంగా కూడాను. హంపి సందర్శన మరొక్క సారి మీలోని ఆత్మ విశ్వాసం పునరుద్ధరిస్తుంది. నడవండి, ధ్యానించండి, మరొక్క మారు నెమరు వేసుకోండి. అసలు ఏమి జరిగి పోయింది ? ప్రస్తుతం ఏమి జరుగుతోంది అనేది అర్ధం అయిపోతుంది.

లోనావాలా హిల్ స్టేషన్ ఆనందాలు
మీలోని ఒంటరి ఆవేదనను వెళ్ళగక్కేందుకు లోనావాలా హిల్ స్టేషన్ ఖచ్చితమైన ప్రదేశం. లోనవాలా మహారాష్ట్ర లోని పూనే జిల్లాలో కలదు. అక్కడ గల గుహలు సందర్శించండి లేదా రోజంతా అక్కడే గడపండి. అదనపు ఆనందాలకు ఫ్రెండ్స్ తో కలసి వెళ్ళటం సూచించ దగినది. Photo Courtesy: ptwo

ఆనందాలను అందించే ధనౌల్తి హిల్ స్టేషన్
మీలో వున్న వ్యతిరేక భావాలు పోగొట్టి మానసిక స్థిరత్వం తెచ్చేందుకు హిల్ స్టేషన్ లు బాగా పని చేస్తాయి. వాటిలో ధనౌల్తి ఒకటి. ధనౌల్తి హిల్ స్టేషన్ చంబ మరియు సచిన్ బాగా ఇష్టపడే ముస్సూరీ ల మధ్య కలదు. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ లోని తెహ్రి జిల్లా లో కలదు. ధనౌల్తి మీకు తప్పక ఒంటరితనం నుండి ఊరట కలిగించి మరో మారు సంబంధానికి రెడీ అయ్యేలా కూడా చేస్తుంది.
Photo Courtesy: rajkumar1220

గోవా బీచ్ లు
బీచ్ తీరాలు మీకు గల నెగటివ్ భావాలను తొలగించి పాజిటివ్ భావనలు కలిగించే ఎనర్జీ ని ఇస్తాయని చెపుతారు. బిజి బిజి గా వుండే నగరాలను కొద్ది రోజులు వదిలేయండి. ఎపుడూ అన్వేషించని గోవా లోని నిర్మానుష్య బీచ్ లలో తిరిగి ఆనందించండి. మరో సారి మీకు మీరుగా ఆనందించండి.



Click it and Unblock the Notifications











